అమరావతి : ఏపీలోని అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం ముదివేడులో విషాదం ( Tragedy ) చోటు చేసుకుంది . గంగమ్మ జాతర ( Gangamma Jatara ) లో విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి చెందారు. రేకుల షెడ్డులో ఉన్న ఇనుప ఊయలపై ఊగుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనపై ముదివేడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.