రాయ్‌పూర్: మాజీ మంత్రి, బీజేపీ నేత కుమారుడు మద్యం మత్తులో కారు నడిపాడు. ఒక షాపులోకి కారును దూకించి ధ్వంసం చేశాడు. ఆ షాపు యజమానిపై దాడి చేశాడు. తనను ఎవరూ ఏమీ చేయలేరంటూ పోలీస్ స్టేషన్ వద్ద కూడా హంగామా చేశాడు. (Ex Minister’s Son’s Drunk Driving) ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బీజేపీ సీనియర్ నేత, మాజీ హోంమంత్రి నాన్కి రామ్ కన్వర్ కుమారుడు సందీప్ కన్వర్ మద్యం మత్తులో విధ్వంసం సృష్టించాడు. మార్చి 11న ఇత్వారీలోని రద్దీ మార్కెట్లో ఒక షాపులోకి కారును దూకించాడు. దీంతో ఆ ఆ షాపు ధ్వంసమైంది.
కాగా, నిలదీసిన షాపు యజమాని అజిన్ ఖురేషిని సందీప్ కన్వర్ దూషించడంతో పాటు దాడి చేశాడు. దీంతో స్థానికులు అక్కడ గుమిగూడారు. తన ప్రవర్తనను ప్రశ్నించిన వారితో వాగ్వాదానికి దిగాడు. ఈ నేపథ్యంలో అతడ్ని స్థానిక పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.
మరోవైపు పోలీస్ స్టేషన్ వద్ద కూడా సందీప్ రెచ్చిపోయాడు. పోలీస్ అధికారుల ముందు గొడవ సృష్టించాడు. ‘మీరు ఏం చేసుకుంటారో చేస్కోండి. నాకు ఏమీ జరుగదు. నేను నాన్కి రామ్ కొడుకును’ అని పదే పదే అన్నాడు. గట్టిగా అరుస్తూ అందరినీ దుర్భాషలాడాడు. ఆ తర్వాత బీజేపీ స్టిక్కర్తోపాటు ‘రాంపూర్ మాజీ ఎమ్మెల్యే’ అని రాసి ఉన్న తన కారులో అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
అయితే ఇది చూసి స్థానికులు షాక్ అయ్యారు. మాజీ మంత్రి, బీజేపీ నేత కుమారుడి రాజకీయ పలుకుబడిపై మండిపడ్డారు. సందీప్ గతంలో కూడా పలుమార్లు ఇలాంటి సంఘటనలకు పాల్పడినట్లు ఆరోపించారు. కాగా, ఆయనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
In Korba, Chhattisgarh, BJP ex-Home Minister Nankiram Kanwar’s son allegedly rammed his car into a shop while drunk, then created a ruckus, boasting: “I am the son of Nankiram; do whatever you have to do, nothing will happen to me.
pic.twitter.com/qisZoqRp2e— Ghar Ke Kalesh (@gharkekalesh) March 12, 2026
Also Read: