భోపాల్: ఐఏఎస్ అధికారిణి ఫామ్‌హౌస్‌లో అక్రమంగా జూదం ఆడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అక్కడ రైడ్ చేశారు. పేకాట ఆడుతున్న 18 మందిని అరెస్ట్ చేశారు. రూ.13.67 లక్షల నగదు, 30 మొబైల్ ఫోన్లు, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు. (IAS Officer’s Farmhouse Raid) మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బుధవారం రాత్రి సీనియర్ ఐఏఎస్ అధికారిణికి చెందిన ఫామ్‌హౌస్ వద్దకు పోలీసులు చేరుకున్నారు. బయట నుంచి గేట్ లాక్ చేసి ఉండగా లోపల నుంచి శబ్దాలు వినిపించడంతో వెనుక గేట్ నుంచి లోపలకు చేరుకున్నారు.
కాగా, ఆ ఫామ్‌హౌస్‌లో భారీ స్థాయిలో పేకాట ఆడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. 18 మందిని అరెస్ట్ చేయగా ఐదుగురు తప్పించుకుని పారిపోయారు. రూ.13.67 లక్షల నగదు, ప్లేయింగ్ కార్డులు, 30 మొబైల్ ఫోన్లు, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఆస్తి మొత్తం విలువ రూ.28.67 లక్షలుగా తేలింది.
మరోవైపు షాడోల్ జిల్లా మాజీ కలెక్టర్, మధ్యప్రదేశ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రస్తుత మేనేజింగ్ డైరెక్టర్ వందన వైద్య, ఆమె భర్త అంబరీష్ వైద్య పేరిట ఈ ఫామ్‌హౌస్ రిజిస్టర్ అయ్యిందని పోలీసులు గుర్తించారు. పారిపోయిన ఫామ్‌హౌస్ కేర్‌టేకర్ రంజీత్ చౌదరి, జగదీష్ రాథోడ్ అలియాస్ ‘అంకుల్’ అలియాస్ ‘కుబాడ’ కలిసి జూదం నిర్వహిస్తున్నట్లుగా తెలిసిందని పోలీస్ అధికారి తెలిపారు. పారిపోయిన ఐదుగురిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. దీనిపై మరింతగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
కాగా, తమ ఫామ్‌హౌస్‌పై పోలీసుల రైడ్ గురించి సోషల్ మీడియా ద్వారా తెలిసిందని సీనియర్ ఐఏఎస్ అధికారిణి వందన వైద్య తెలిపారు. కేర్‌టేకర్ దీనిని నిర్వహిస్తున్నాడని చెప్పారు. ఇక్కడ జూదం జరుగుతున్న సంగతి తనకు తెలియదన్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన వ్యక్తులతో ఎలాంటి సంబంధం లేదని వివరించారు. దీనిపై న్యాయంగా, నిష్పాక్షికంగా దర్యాప్తు జరుపాలని పోలీస్ అధికారులను ఆమె కోరారు.
मध्यप्रदेश कैडर की IAS अधिकारी वंदना वैद्य के इंदौर स्थित फार्म हाउस से पकड़े गए 18 जुआरी और 13 लाख कैश…!
नेताओं के बाद इस देश को बेचने की होड़ इन अफसरों में लगी है। pic.twitter.com/TD0Xhl3vnI
— Arvind Sharma (@sarviind) March 11, 2026
Also Read:
brain-dead woman comes to life | బ్రెయిన్ డెడ్‌గా ప్రకటన.. అంబులెన్స్ గుంతలో పడటంతో బతికిన మహిళ
Induction cooktops | దేశంలో ఎల్పీజీ సంక్షోభం.. ఇండక్షన్ కుక్‌టాప్‌లకు పెరిగిన డిమాండ్