లక్నో: ఒక బాలికపై ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది లైంగిక దాడికి పాల్పడినట్లు కేసు నమోదైంది. అయితే కోర్టు విచారణ సందర్భంగా ఆమె మాట మార్చింది. తనపై లైంగిక దాడి జరిగినట్లు కలగన్నానని కోర్టుకు తెలిపింది. (Air Force Personnel Acquitted) ఈ నేపథ్యంలో ఆ వ్యక్తిని నిర్దోషిగా కోర్టు విడుదల చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఈ సంఘటన జరిగింది. ఎయిర్‌ఫోర్స్‌లో ఎయిర్‌మ్యాన్‌గా పని చేస్తున్న అనురాగ్ శుక్లాకు 2019 ఫిబ్రవరి 10న శివానీ అనే మహిళతో పెళ్లి జరిగింది.
కాగా, ఆ ఏడాది మార్చి 9న అక్క ఇంట్లో నిద్రిస్తున్న తనపై బావ అనురాగ్ శుక్లా లైంగిక దాడికి పాల్పడినట్లు శివానీ సోదరి అయిన 15 ఏళ్ల బాలిక ఫిర్యాదు చేసింది. దీంతో ఆగస్ట్ 3న నౌబస్తా పోలీస్ స్టేషన్లో పోక్సో చట్టంతో పాటు పలు సెక్షన్ల కేసు నమోదైంది. సెప్టెంబర్ 29న అనురాగ్ శుక్లాను పోలీసులు అరెస్ట్ చేశారు. 19 రోజులు జైలులో ఉన్న తర్వాత అక్టోబర్ 17న ఆయనకు బెయిల్ మంజూరైంది.
మరోవైపు పోక్సో ప్రత్యేక కోర్టులో ఏడేళ్ల పాటు ఈ కేసు విచారణ కొనసాగింది. అయితే బావపై లైంగిక ఆరోపణలు చేసిన బాధిత బాలిక కోర్టులో మాట మార్చింది. ఆ రోజు తాను యాంటీబయెటిక్స్ తీసుకున్నానని, రాత్రి వేళ నిద్ర మత్తులో ఉండగా బావ అనురాగ్ తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు కల వచ్చినట్లు చెప్పింది. దీంతో భయంతో మేల్కొని పెద్దగా అరిచినట్లు వెల్లడించింది.
అయితే బాలిక తండ్రి, ఆమె అక్క శివానీ కూడా అపార్థం కారణంగా ఈ కేసు నమోదైనట్లు కోర్టుకు తెలిపారు. బాలిక సాక్ష్యం, తండ్రి, అక్క వాంగ్మూలాలను న్యాయమూర్తి రష్మీ సింగ్ పరిగణనలోకి తీసుకున్నారు. నిందితుడైన అనురాగ్ శుక్లాను నిర్దోషిగా ప్రకటించారు. మార్చి 7న ఈ మేరకు తీర్పు ఇచ్చారు.
కాగా, ఈ కేసు వల్ల తాను తీవ్రమైన మానసిక ఒత్తిడి అనుభవించినట్లు ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేస్తున్న అనురాగ్ శుక్లా తెలిపారు. సామాజిక అపఖ్యాతితో పాటు తన కెరీర్ అవకాశాలను ఇది దెబ్బతీసిందని చెప్పారు. 2020లో ఐఏఎఫ్‌లో కార్పోరల్‌గా పదోన్నతి పొందలేకపోయిన తాను ప్రస్తుతం ఎయిర్క్రాఫ్ట్మ్యాన్గా కొనసాగుతున్నట్లు వెల్లడించారు.
Also Read:
Don’t panic on LPG | ఎల్పీజీ కొరతపై భయాందోళన వద్దు.. అనవసరంగా బుకింగ్ చేయవద్దు: కేంద్రం
Induction cooktops | దేశంలో ఎల్పీజీ సంక్షోభం.. ఇండక్షన్ కుక్‌టాప్‌లకు పెరిగిన డిమాండ్
brain-dead woman comes to life | బ్రెయిన్ డెడ్‌గా ప్రకటన.. అంబులెన్స్ గుంతలో పడటంతో బతికిన మహిళ
Woman Poisons Daughter | విషమిచ్చి కుమార్తెను చంపిన తల్లి.. ప్రియుడిని ఇరికించేందుకు యత్నం