Woman Poisons Daughter | విషమిచ్చి కుమార్తెను చంపిన తల్లి.. ప్రియుడిని ఇరికించేందుకు యత్నం
Woman Poisons Daughter | ఒక మహిళ తన కుమారుడితో కలిసి కుమార్తెకు విషం ఇచ్చి చంపింది. కుమార్తె ప్రియుడిని ఈ కేసులో ఇరికించేందుకు ప్రయత్నించింది. దర్యాప్తు చేసిన పోలీసులు అసలు నిందితులను అరెస్ట్ చేశారు.
లక్నో: ఒక మహిళ తన కుమారుడితో కలిసి కుమార్తెకు విషం ఇచ్చి చంపింది. కుమార్తె ప్రియుడిని ఈ కేసులో ఇరికించేందుకు ప్రయత్నించింది. దర్యాప్తు చేసిన పోలీసులు అసలు నిందితులను అరెస్ట్ చేశారు. (Woman Poisons Daughter) ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గాజీపూర్ ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల ఫర్జానాకు గత ఏడాది అక్టోబర్‌లో సోషల్ మీడియా ద్వారా సునీల్ యాదవ్‌తో పరిచయం ఏర్పడింది. పెళ్లి పేరుతో అతడు ఆమెను లోబర్చుకున్నాడు. ఈ నేపథ్యంలో ఫర్జానా గర్భం దాల్చింది. సునీల్ ఆమెకు అబార్షన్ చేయించాడు. పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడు.
కాగా, అబార్షన్ వల్ల ఫర్జానా అనారోగ్యం చెందింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె తల్లి అయిన 48 ఏళ్ల అఫ్సానా కుమార్తెను ఇంటి నుంచి వెళ్లగొట్టింది. ఫర్జానా ఈ విషయాన్ని సునీల్‌కు చెప్పింది. దీంతో ఆమెను ఐదు రోజుల పాటు తన వద్ద ఉంచుకున్నాడు. అయితే తన కుమార్తె కనిపించడం లేదని ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి వెతికారు.
మరోవైపు ఫిబ్రవరి 26న ఫతేపూర్ రైల్వే స్టేషన్లో ఫర్జానా అపస్మారక స్థితిలో కనిపించింది. జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు ఆ యువతిని జిల్లా ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. ఆమె గురించి అడగ్గా ప్రియుడు సునీల్ పరిచయం, అతడి ద్వారా గర్భం దాల్చడం, అబార్షన్ తర్వాత తనను రైల్వే స్టేషన్ వద్ద వదిలేసి వెళ్లినట్లు ఆమె ఆరోపించింది. సునీల్‌పై ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
కాగా, ఫర్జానాకు చికిత్స తర్వాత ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. అయితే కుటుంబం ఆమెను ఆసుపత్రి నుంచి ఇంటికి తరలించారు. మార్చి 1న అర్ధరాత్రి వేళ సునీల్ పొలానికి ఫర్జానాను ఆమె తల్లి, సోదరుడు తీసుకెళ్లారు. అక్కడ బలవంతంగా సల్ఫోస్ పౌడర్ తినిపించగా ఆమె మరణించింది. ప్రియుడు సునీల్ తన కుమార్తెను హత్య చేసినట్లు తల్లి అఫ్సానా పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మరోవైపు ఫర్జానా మృతదేహానికి పోలీసులు పోస్ట్‌మార్టం నిర్వహించారు. ఆమె హత్యపై దర్యాప్తు చేశారు. సీసీటీవీ ఫుటేజ్, ఫోన్ కాల్స్ వంటి ఆధారాలు పరిశీలించారు. అఫ్సానా, తన కుమారుడైన 26 ఏళ్ల అఫ్సర్‌తో కలిసి బలవంతంగా విషం తినిపించి కుమార్తెను చంపినట్లు దర్యాప్తులో తెలిసింది. దీంతో వారిద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
అయితే పంట పంచుకునే ఒప్పందం ఆధారంగా సునీల్ పొలంలో అఫ్సానా పనిచేస్తున్నదని పోలీస్ అధికారి తెలిపారు. హిందువైన సునీల్‌తో కుమార్తె సంబంధం గురించి గ్రామంలోని వారికి తెలియడం, సామాజిక అవమానానికి భయపడిన ఆమె కుమార్తెను చంపిందని చెప్పారు. సునీల్‌పై ఫర్జానా చేసిన ఫిర్యాదుపైనా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Man Sets Partner on Fire | స్కూటీ ఇచ్చేందుకు నిరాకరణ.. మహిళ, ఆమె పేరెంట్స్‌కు నిప్పంటించిన వ్యక్తి
Watch: ప్రియుడ్ని విడుదల చేయాలంటూ మొబైల్ టవర్ ఎక్కిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

