Man Sets Partner on Fire | స్కూటీ ఇచ్చేందుకు నిరాకరణ.. మహిళ, ఆమె పేరెంట్స్‌కు నిప్పంటించిన వ్యక్తి
Man Sets Partner on Fire | ఒక మహిళ తన స్కూటీ ఇచ్చేందుకు నిరాకరించింది. ఆమెతో సహజీవనం చేసిన వ్యక్తి ఆగ్రహించాడు. ఆ మహిళతోపాటు ఆమె తల్లిదండ్రులపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. కాలిన గాయాలైన ఆ ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
బెంగళూరు: ఒక మహిళ తన స్కూటీ ఇచ్చేందుకు నిరాకరించింది. ఆమెతో సహజీవనం చేసిన వ్యక్తి ఆగ్రహించాడు. ఆ మహిళతోపాటు ఆమె తల్లిదండ్రులపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. కాలిన గాయాలైన ఆ ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. (Man Sets Partner on Fire) ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. నందిని లేఅవుట్ ప్రాంతంలో నివసించే 32 ఏళ్ల పాండురంగకు ఇన్‌స్టాగ్రామ్‌లో 27 ఏళ్ల సుమలత పరిచయమైంది. పెళ్లై ఇద్దరు కుమారులున్న ఆమె తన భర్తను వదిలేసింది. దీంతో పాండురంగ, సుమలత కలిసి ఏడాది పాటు సహజీవనం చేశారు. వారికి కుమార్తె పుట్టింది. అయితే గొడవల వల్ల వారిద్దరూ విడిపోయారు.
కాగా, ఇంటి పనులు చేస్తున్న సుమలత తన తల్లిదండ్రులతో కలిసి తారబనహళ్లి ప్రాంతంలో నివసిస్తున్నది. మార్చి 6న సాయంత్రం 6.30 గంటల సమయంలో సుమలత ఇంటికి పాండురంగ చేరుకున్నాడు. ఆమె స్కూటీ తాళం ఇవ్వమని అడిగాడు. సుమలత నిరాకరించడంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో సుమలత తల్లిదండ్రులు జ్యోకం చేసుకున్నారు.
మరోవైపు ఆగ్రహించిన పాండురంగ బాటిల్లో తెచ్చిన పెట్రోల్‌ను సుమలత, ఆమె తల్లిదండ్రులపై పోసి నిప్పంటించి పారిపోయాడు. కాలిన గాయాలైన ఆ ముగ్గురిని స్థానికులు ఆసుపత్రికి తరలించగా వారు చికిత్స పొందుతున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు నిందితుడైన పాండురంగను అరెస్ట్ చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:
man stabs twin sister | ఇన్స్టాగ్రామ్ యువతితో బ్రేకప్.. కవల సోదరి, తల్లిపై కత్తితో వ్యక్తి దాడి
IndiGo flight U-turn | ఇథియోపియా సరిహద్దు దగ్గర ఇండిగో విమానం యూ టర్న్.. ఢిల్లీలో ల్యాండ్
Watch: ప్రియుడ్ని విడుదల చేయాలంటూ మొబైల్ టవర్ ఎక్కిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 17-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్‌లో అన్నీ స్కామ్‌లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

