నీలగిరి, ఆగస్టు 17: కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిన కల్యాణ లక్ష్మి ,షాదీ ముబారక్ పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం నల్లగొండ, సాగర్ మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, నో ముల భగత్‌కుమార్ ఆధ్వర్యంలో నల్లగొండ కలెక్టరేట్ వద్ద చేపట్టిన ధర్నా ఉద్రిక్తంగా మా రింది. బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వస్తున్నారని గ్రహించిన పోలీసులు భారీగా మోహరించారు. సుమారు గంటన్నర పాటు ధర్నా చేసిన అనంతరం మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల, భగత్ తదితరులు కలెక్టర్‌కు వినతి పత్రం ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని కోరడంతో పోలీసులు నిరాకరిస్తూ.. అదనపు కలెక్టర్‌కు ఇవ్వాలని సూచించారు.
అయతే సమస్యలు చాలా ఉన్నాయని నేరుగా కలెక్టర్‌నే కలిసి వివరిస్తామని వారు పేర్కొన్నారు. కలెక్టర్ గ్రీవెన్స్‌లో ఉన్నారని బయటకు వచ్చే సమ యం లేదని పోలీసులు చెప్పడంతో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు వచ్చినా కలెక్టర్ స్పందించకపోవడం ఏమిటని ప్రశ్నిస్తూ ఆదనపు కలెక్టర్‌కు వినతి పత్రం ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో పార్టీ కార్యకర్తలు ఒక్కసారిగా కలెక్టరేట్ గేటును నెట్టుకుంటూ లోనికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశా రు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో పోలీసులు కలెక్టరేట్ మెయిన్ గేటును మూసి బీఆర్ఎస్ శ్రేణులను అడ్డుకున్నారు. అక్కడ కూడా బీఆర్ఎస్ శ్రేణులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. చివరకు కలెక్టర్ జోక్యం చేసుకొని వినతి పత్రం స్వీకరిస్తానని చెప్పడంతో బీఆర్ఎస్ శ్రేణులు అందోళన విరమించారు.

అనంతరం బీఆర్ఎస్ జిల్లా ఇంచార్జి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల, భగత్ ఆధ్వర్యంలో కలెక్టర్ చాంబర్లో వినతిపత్రం అందజేశారు. ఈ సం దర్భంగా బీఆర్ఎస్ జిల్లా ఇంచార్జి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ రేవంత్ ప్రభు త్వం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్…పథకాల రద్దుకు పూనుకున్నదని, ఈ పథకాలపై కోర్టులో కేసు ఉన్నదని తెలిసినా, కావాలనే సరైన వాదనలు వినిపించకుండా కోర్టులో వ్యతిరేక తీర్పు వచ్చేలా రేవం త్ రెడ్డి ప్రయత్నం చేశారన్నారు. విజయ్‌గోపాల్ అనే అడ్వొకేట్ హైకోర్టులో పిల్ వేస్తే ప్రభుత్వం ఇప్పటివరకు ఎం దుకు స్పందించలేదని విమర్శించారు. అడ్వొకేట్ జనరల్, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయకుండా కాలయాపన చేశారన్నారు. 9 నెలలుగా వెరిఫికేషన్ పేరుతో లబ్ధిదారులకు చెల్లింపులు నిలిపివేశారన్నారు.
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ను సమర్థిస్తూ ప్రభుత్వం వెంటనే కౌంటర్ దాఖ లు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోతే బీఆర్ఎస్ లీగల్ సెల్ ఆధ్వర్యంలో న్యాయపోరాటం చేస్తామన్నారు. నల్లగొండలో డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపులో జరిగిన అక్రమాలపై విచారణ జరిపి అర్హులైన వారికి కేటాయించాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ మాట్లాడుతూ పేదల పథకాలను నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందని విమర్శించారు.
డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపులో అక్రమాలు జరిగాయని, గతంలో డ్రా ద్వారా ఎంపికైన లబ్ధిదారులకే ఇండ్లు ఇవ్వాలని అన్నారు. పేదల ఇళ్లను అమ్ముకుంటున్నారనే ఆరోపణలపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో ట్రైకార్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రామచంద్రు నాయక్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడే రెగట్టె మ ల్లికార్జున్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ మం దడి సైదిరెడ్డి, అభిమన్యుశ్రీనివాస్, నగర, మండల పార్టీ అధ్యక్షులు బోనగిరి దేవేందర్, దేప వెంకట్ రెడ్డి, ఐతగొని యాదయ్య, రా వు ల శ్రీనివాస రెడ్డి, కార్పొరేటర్లు పెరిక యాద య్య, పేర్ల అశోక్, రత్నగిరి శ్రీనివాస్, కుం దూ రు ప్రవీణ్ రెడ్డి, బాణోతు దీప్లా, దొడ్డి రమేష్, గోపగోని స్వాతి రాజశేఖర్,దండంపల్లి సత్త య్య, కె.లక్ష్మయ్య, సుంకిరెడ్డి వెంకట్‌రెడ్డి, రంజిత్, శ్రీనివాస్, జహంగీర్ పాల్గొన్నారు.