న్యూఢిల్లీ: దేశంలో ఎల్పీజీ సిలిండర్ల కొరతపై ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో గ్యాస్ బుకింగ్‌లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఎల్పీజీ సిలిండర్ల కొరతపై ఎలాంటి భయాందోళనలు వద్దని తెలిపింది. అనవసరంగా గ్యాస్ సిలిండర్లను బుకింగ్ చేయవద్దని సూచించింది. (Don’t panic on LPG) అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం కారణంగా చమురుతోపాటు ఎల్పీజీ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీంతో ఎల్పీజీ సిలిండర్ల కొరతతో పాటు రేట్లు పెరుగడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ముందు జాగ్రత్త కోసం గ్యాస్ సిలిండర్లు బుక్ చేస్తున్నారు.
కాగా, కేంద్ర ప్రభుత్వం బుధవారం దీనిపై స్పందించింది. దేశంలో తగినంత ఎల్పీజీ నిల్వలు ఉన్నాయని తెలిపింది. ప్రస్తుతం దేశంలో రోజుకు దాదాపు 55 లక్షల బ్యారెళ్ల ముడి చమురు అందుబాటులో ఉన్నదని మీడియా సమావేశంలో ప్రభుత్వ అధికారి వివరించారు.
మరోవైపు ఈ కాలంలో సాధారణంగా హార్ముజ్ జలసంధి ద్వారా వచ్చే దానికంటే ఎక్కువగా చమురు, ఎల్పీజీ నిల్వలు ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం దేశంలోని డిమాండ్‌ను తీర్చడానికి తగినంత సేకరణ కూడా జరుగుతున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో దయచేసి అనవసరమైన ఎల్పీజీ బుకింగ్‌లను నివారించాలని ప్రజలను కోరింది.
Also Read:
Induction cooktops | దేశంలో ఎల్పీజీ సంక్షోభం.. ఇండక్షన్ కుక్‌టాప్‌లకు పెరిగిన డిమాండ్
brain-dead woman comes to life | బ్రెయిన్ డెడ్‌గా ప్రకటన.. అంబులెన్స్ గుంతలో పడటంతో బతికిన మహిళ
Woman Poisons Daughter | విషమిచ్చి కుమార్తెను చంపిన తల్లి.. ప్రియుడిని ఇరికించేందుకు యత్నం