BK Ponwar | భారత్-పాకిస్థాన్ యుద్ధ యోధుడు బసంత్ కుమార్ పొన్వార్ కన్నుమూత..!
BK Ponwar | భారత్, పాకిస్థాన్ (India, Pakistan) నడుమ జరిగిన 1971 నాటి యుద్ధంలో విశేష సేవలు అందించిన అనుభవజ్ఞుడు, మావోయిస్టుల తిరుగుబాటుకు వ్యతిరేకంగా దేశంలో ఆధునిక అటవీ యుద్ధ తంత్రానికి రూపకర్త అయిన రిటైర్డ్ బ్రిగేడియర్ (Retired Brigadiar) బసంత్‌కుమార్ పొన్వార్ (Basant Kumar Ponwar) కన్నుమూశారు.
BK Ponwar : భారత్, పాకిస్థాన్ (India, Pakistan) నడుమ జరిగిన 1971 నాటి యుద్ధంలో విశేష సేవలు అందించిన అనుభవజ్ఞుడు, మావోయిస్టుల తిరుగుబాటుకు వ్యతిరేకంగా దేశంలో ఆధునిక అటవీ యుద్ధ తంత్రానికి రూపకర్త అయిన రిటైర్డ్ బ్రిగేడియర్ (Retired Brigadiar) బసంత్‌కుమార్ పొన్వార్ (Basant Kumar Ponwar) కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయస్సు 77 ఏళ్లు. బుధవారం కుటుంబసభ్యులు ఈ విషయాన్ని ప్రకటించారు.
బసంత్ కుమార్ కుమారులు ఇద్దరూ సైన్యంలో చేరి దేశానికి సేవలందిస్తున్నారు. పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో యువ అధికారిగా బసంత్‌కుమార్ ఆకస్మిక దాడులకు నాయకత్వం వహించి, ఢాకా వైపు మన సేనలు వేసిన ముందడుగులో కీలకపాత్ర పోషించారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో పుట్టిన ఆయన 1969 లో సైన్యంలో చేరారు. 36 ఏళ్ల మిలిటరీ కెరియర్లో పలు మైలురాళ్లను అధిగమించి, అవార్డులు అందుకున్నారు.
2005 లో సైన్యం నుంచి రిటైర్ అయ్యాక ఛత్తీస్‌గఢ్ పోలీసు విభాగంలో ఐజీగా నియమితులై ఉత్తర బస్తర్‌లోని కాంకేర్‌లో ‘కౌంటర్ టెర్రరిజం అండ్ జంగిల్ వార్ఫేర్ కాలేజ్’ ను స్థాపించారు. ఈ కళాశాలలో 18 ఏళ్లు పనిచేసి, నక్సల్స్‌ను ఎదుర్కొనేందుకు 37 వేల మందికిపైగా పోలీసులకు శిక్షణ ఇచ్చారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్‌పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

