Actor Suhas | హీరో సుహాస్‌పై వర్ణ వివక్ష విమర్శలు.. నెటిజన్ల తీవ్ర ఆగ్రహం!
Actor Suhas | గ్లామర్ ప్రపంచమైన సినిమా రంగంలో టాలెంట్ ముఖ్యం కానీ రంగు, రూపాలు కాదనే విషయం మరోసారి చర్చనీయాంశమైంది.
Actor Suhas | గ్లామర్ ప్రపంచమైన సినిమా రంగంలో టాలెంట్ ముఖ్యం కానీ రంగు, రూపాలు కాదనే విషయం మరోసారి చర్చనీయాంశమైంది. తాజాగా ‘మండాడి’ సినిమా సక్సెస్ ఈవెంట్లో ఆ చిత్ర దర్శకుడు చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో సంచలనం సృష్టించాయి. తన సినిమాలో నటించిన టాలీవుడ్ నటుడు సుహాస్ కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న అవమానాల గురించి ఆ దర్శకుడు ప్రస్తావించారు. సుహాస్ నల్లగా ఉన్నాడంటూ కొందరు తీవ్రమైన కామెంట్లు చేశారని, తన సొంత ఊర్లోనూ రంగును బేస్ చేసుకుని కొందరు ఎద్దేవా చేశారని సుహాస్ ఎమోషనల్ అయిన విషయాన్ని ఆ డైరెక్టర్ గుర్తుచేసుకున్నారు. తమిళనాడు వంటి ప్రాంతాల్లో రంగు ఆధారంగా వివక్ష చూపించరని, ఏ నటుడిని వారి కలర్ ఆధారంగా అంచనా వేయకూడదని ఆయన పేర్కొన్నారు.
అయితే ఈ వ్యాఖ్యలు టాలీవుడ్‌ని ఉద్దేశించి దర్శకుడు చేశాడని పలువురు తప్పుబడుతున్నారు. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ నటుల రంగును బట్టి వారిని అంచనా వేయరని. స్నేహితుల మధ్య సరదాగా లేదా చిన్నతనంలో రంగును ఉద్దేశించి చేసుకునే కామెంట్లను కొందరు పెద్దవి చేసి చూడటం సరికాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. టాలీవుడ్ ప్రేక్షకులకు నటుల రంగుతో ఎలాంటి సంబంధం లేదని, కేవలం మంచి కథలు, సహజమైన నటన మాత్రమే వారికి ముఖ్యమని సినీ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఇందుకు ఉదాహరణగా కోలీవుడ్ స్టార్లు రజనీకాంత్, ధనుష్, విజయ్ సేతుపతి వంటి నటులకు తెలుగు ప్రేక్షకులు ఇస్తున్న నీరాజనాలను గుర్తుచేస్తున్నారు. రంగుతో సంబంధం లేకుండా కేవలం ప్రతిభను మాత్రమే నమ్ముకుని ఎదిగిన సుహాస్ ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకమని, ప్రేక్షకులు ఎప్పుడూ టాలెంట్‌కే పట్టం కడతారని చెప్పడానికి ఇదే నిదర్శనమని అభిమానులు పేర్కొంటున్నారు.
#Mandaadi director Mathiraman says #Suhas was disappointed with the racist comments back home. But in TN, people love your colour , Sattai Puli is being celebrated here . pic.twitter.com/LnxGpIgoPk
— Rajasekar (@sekartweets) September 17, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్‌లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
Non Veg | నాన్‌వెజ్ తినే మహిళలు వందేళ్లు బతుకుతారంట.. సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడి
Farmers | పంటలు ఎండిపోతున్నా పట్టింపు లేదా.. అన్నదాతల ఆగ్రహం
Gang Rape | మహిళపైనా ‘గ్యాంగ్ రేప్’ కేసు పెట్టొచ్చు.. ఢిల్లీ హైకోర్టు చరిత్రాత్మక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

