Karimnagar | కమాన్ చౌరస్తా: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని యజ్ఞవరాహస్వామి క్షేత్ర వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా గురువారం మహాపూర్ణాహుతి కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఉదయం నిత్యహోమం, సర్వదైవత్య హోమం వేదపండితుల మంత్రోచ్ఛారణల (Chantings) మధ్య చేపట్టారు. అనంతరం మహాపూర్ణాహుతి, కళావాహనం, నీరాజనం, మహదాశీర్వచనం కార్యక్రమాలను (Programmes) శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యజ్ఞవరాహస్వామికి ప్రత్యేక పూజలు చేసి భక్తులకు తీర్థప్రసాదం, అన్నప్రసాదం పంపిణీ చేశారు.
ఈ ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు యజ్ఞవరాహ క్షేత్ర అధికారిక వెబ్సైట్ను అతిథులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాల్లో సర్వ వేదిక సంస్థానం ట్రస్ట్ శ్రీభాష్యం వరప్రసాద్, ధర్మకర్తలు పాల్గొన్నారు.