న్యూఢిల్లీ: ఇరాన్ యుద్ధం నేపథ్యంలో చమురు, సహజ వాయువు సరఫరాలో ప్రపంచ వ్యాప్తంగా కొరత నెలకొన్నది. దీంతో దేశంలో ఎల్పీజీ సంక్షోభం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ ఇండక్షన్ కుక్‌టాప్‌లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. (Induction cooktops) ఇరాన్ యుద్ధ ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల కొరతతోపాటు రేట్లు భారీగా పెరిగాయి. దీంతో ప్రత్యామ్నాయాలపై ప్రజలు దృష్టిసారిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ ఇండక్షన్ కుక్‌టాప్‌లను భారీగా కొనుగోలు చేస్తున్నారు.
కాగా, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో ఇండక్షన్ కుక్‌టాప్‌లకు డిమాండ్ పెరిగింది. ఆన్‌లైన్‌తో పాటు షాపుల్లో వీటి కొనుగోళ్లు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఇండక్షన్ కుక్‌టాప్స్ స్టాక్ లేనట్లు కూడా కొన్ని ఆన్లైన్ ఫ్లాట్‌ఫారాల్లో కనిపిస్తున్నది. అలాగే కొన్ని ప్రాంతాల్లో ఐరన్, బొగ్గు పొయ్యిలకు కూడా డిమాండ్ పెరిగింది.
మరోవైపు ఎలక్ట్రిక్ ఇండక్షన్ కుక్‌టాప్‌లపై వంట చేయడానికి అనుకూలమైన పాత్రలు కూడా అవసరం. ఈ నేపథ్యంలో ఆయా పాత్రలు, పాన్లకు కూడా ఆన్లైన్ మార్కెట్‌తో పాటు షాపుల్లో డిమాండ్ పెరిగింది.
అయితే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత వల్ల వాటి బ్లాక్‌మార్కెట్ కూడా బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో పలు హోటల్స్ మూతపడ్డాయి. వసతి గృహాల్లో దోస, పూరి, చపాతీ వంటి పదార్థాలను అందించబోమని నిర్వాహకులు చెబుతున్నారు. ఈటరీ స్టాల్స్ కూడా ఆహార పదార్థాల రేట్లను భారీగా పెంచాయి. మొత్తం మీద అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధ ప్రభావం భారత్‌పై తీవ్రంగా ఉన్నట్లు కనిపిస్తున్నది.
Also Read:
Woman Poisons Daughter | విషమిచ్చి కుమార్తెను చంపిన తల్లి.. ప్రియుడిని ఇరికించేందుకు యత్నం
brain-dead woman comes to life | బ్రెయిన్ డెడ్‌గా ప్రకటన.. అంబులెన్స్ గుంతలో పడటంతో బతికిన మహిళ