కుభీర్: నిర్మల్ జిల్లా కుభీర్ తహసీల్దార్ ( Kubheer Tahasil ) కార్యాలయంలోని గిర్ధావర్ గదిలోకి పాము( Snake ) దూరడంతో సిబ్బంది ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో పాము కనిపించడంతో ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు.
స్నేక్ క్యాచర్కు సమాచారం అందించగా, భైంసా నుంచి అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ పామును సురక్షితంగా పట్టుకున్నారు. దీంతో తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. సుమారు గంటన్నర పాటు గందరగోళ పరిస్థితి ఏర్పడింది. పట్టుకున్న పామును అటవీ ప్రాంతంలో వదిలేశారు.