RS Praveen Kumar | కేసీఆర్ పెనుముప్పు నుంచి రక్షించారు.. విజిలెన్స్ నివేదికలు కవిత వద్దకు ఎలా వెళ్తాయి..? : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
RS Praveen Kumar | రేవంత్ రెడ్డి నేతృత్వంలో అధికార పక్షం దోపిడీ నిరంతరంగా సాగుతోంది. ఎన్ని కేసులు పెట్టినా, ఇబ్బంది పెట్టినా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు.
RS Praveen Kumar | కవితను పార్టీ నుంచి బహిష్కరించినందుకు కేసీఆర్‌కు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. దుర్మార్గమైన దోపిడీ, పెనుముప్పు నుంచి రక్షించారని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… రేవంత్ రెడ్డి సౌజన్యంతో పాంచజన్యం ఎజెండాతో టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేశారు, ఆధారాలు ప్రజల ముందు బయటపెడతానన్నారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలో అధికార పక్షం దోపిడీ నిరంతరంగా సాగుతోంది. ఎన్ని కేసులు పెట్టినా, ఇబ్బంది పెట్టినా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.
అధికార పక్షంపై దోపిడీ చేయాల్సిన కవిత… బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తున్నారు. తండ్రి కేసీఆర్‌తోపాటు కేటీఆర్, హరీశ్ రావును విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ కు నాలుగో అనుబంధ సంస్థగా టీఆర్ఎస్, రేవంత్ రక్షణ సేనగా పనిచేస్తోంది. కేటీఆర్, హరీశ్ రావుపై నిత్యం గళమెత్తుతున్న టీఆర్ఎస్… కాంగ్రెస్‌కు అనుబంధ సంస్థ కాకపోతే మరేమిటి..? అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు.
2012లో ఆడి కోర్ ఇన్ ఫ్రా కంపెనీకి రేవంత్ రెడ్డి డైరెక్టర్, 2010 లో కవిత డైరెక్టర్, సూదిని సృజన్ రెడ్డి ఇంకో డైరెక్టర్… ఇది కల్పితం కాదు. రూ.1000 కోట్ల కాలువ పని సృజన్ రెడ్డికి వచ్చే వరకు కవిత వదల్లేదు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు భూకంపం వచ్చిన ప్రాంతంలో నిర్మించారని కవిత అన్నారు. కేంద్ర జలసంఘం, జీఎస్ఐ నుంచి అనుమతులు వచ్చిన తర్వాతే 50 టీఎంసీల జలాశయం కట్టాలని నిర్మించారు.కేసీఆర్ ఆదేశాలు, హరీశ్ రావు పర్యవేక్షణలో ఇంజనీర్లు నిర్ణయం తీసుకున్నారు విజిలెన్స్ విభాగం నివేదికలను సీఎంకు పంపుతుంది కానీ, రహస్యంగా తయారు చేసిన ఆ నివేదికలు కవితకు ఎలా వచ్చాయి..? రేవంత్ రెడ్డి ఇచ్చినట్లే కదా… అధికారిక రహస్యాల ఉల్లంఘన కాదా..? అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు.
19న సిద్దిపేటలో సీఎం ఈ అంశాలనే మాట్లాడతారు.. రేవంత్ రెడ్డి కవితను సిద్దిపేటకు వెళ్లమని చెప్పారు, స్క్రిప్ట్ ఇచ్చారు… అవే మళ్లీ మాట్లాడతారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. కవితకు కామన్ సెన్స్ లేకపోవడం నవ్వు వస్తోందని ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. కొండ పోచమ్మ సాగర్ నుంచి కేసీఆర్ ఫాంహౌస్‌కు కాల్వ వెళ్లిందని అంటున్నారు. రిజర్వాయర్ కింద కేసీఆర్ భూమికి కూడా నీరు వెళ్తే కవితకు ఏం ఇబ్బంది.. ? రేవంత్ రెడ్డి స్క్రిప్ట్ ఇస్తే కవిత మాట్లాడుతున్నారు. నిమ్స్ లో హరీశ్ రావు రూ.200 కోట్ల కుంభకోణం చేశారని కవిత అన్నారు.
కవిత ఉద్యోగుల పక్షమా… రేవంత్ రెడ్డి పక్షమా…?
నిమ్స్ లోని ఉద్యోగుల ఈపీఎస్ సరిగ్గా అందుకోవడంతో జీపీఎఫ్‌కు వెళ్తామని అన్నారు. పాంచజన్యం పేరుతో పచ్చి అబద్ధాలు చెప్పడంలో కవిత దిట్ట. జీపీఎఫ్ ఉద్యోగుల డబ్బులు ఈపీఎఫ్ కు ఇస్తున్నారని జీపీఎఫ్ ఉద్యోగులు కవితకు ఫిర్యాదు చేశారని అనడం విడ్డూరంగా ఉందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు.
హరీశ్ రావు చేసిన తప్పేమిటి..? మంత్రిగా ఉద్యోగులకు ఈపీఎఫ్ ఇప్పించడం తప్పా..? ప్రస్తుత సలహాదారు రామకృష్ణారావుతోపాటు ఐఏఎస్ అధికారులు, వైద్యులు సంతకం చేశారు కదా..! పెన్షన్ వద్దు అని ఏ ఉద్యోగి అయినా ఫిర్యాదు చేస్తారా..? హరీశ్ రావును విమర్శించాలని సోయి లేకుండా మాట్లాడుతున్నారు. ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తారంటే ఎలా..? అని ప్రశ్నించారు.
నివేదికలు కవిత వద్దకు ఎలా వెళ్తాయి..?
కవిత పేరు చెప్పి ఆసుపత్రుల వద్దకు ఎవరైనా వస్తే… ఆసుపత్రుల ఉద్యోగులు నిలదీయాలి.. రేవంత్ రెడ్డి ఇచ్చాడు కాబట్టే… కవితకు అన్ని రికార్డులు వెళ్తున్నాయి.. లేని నివేదికలు సృష్టించే శాఖను రేవంత్ రెడ్డి సృష్టించి కవితకు అన్ని వివరాలు అందిస్తున్నారు. రేవంత్ రెడ్డి, కవిత, సృజన్ రెడ్డి కలిసి వ్యాపారాలు చేశారు. ఒకే చిరునామాతో 30 కంపెనీలు ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతల భూములపై అక్రమంగా విచారణకు జీఓ ఇచ్చారు, కాంగ్రెస్ నేతల భూములు కూడా చేర్చాలని అంటున్నాం. విజిలెన్స్ విభాగం వద్ద ఉండాల్సిన నివేదికలు కవిత వద్దకు ఎలా వెళ్తాయి..? అని ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అడిగారు.
LIVE: BRS General Secretary @RSPraveenSwaero Press Meet at Telangana Bhavan
https://t.co/fRs78vjEql
— BRS Party (@BRSparty) November 14, 2026
Read Also :
Vaibhav Sooryavanshi: మెన్స్ టీ20 క్రికెట్లో యంగెస్ట్ కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ రికార్డు
Ashok Galla | న్యూ ఇయర్ కానుకగా అశోక్ గల్లా ‘VISA – వింటారా సరదాగా’!
SpaceX: అతిపెద్ద రాకెట్‌ను ప్రయోగించిన స్పేస్ఎక్స్.. పేలిన ఫస్ట్ స్టేజ్ బూస్టర్
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RS Praveen Kumar | కేసీఆర్ పెనుముప్పు నుంచి రక్షించారు.. విజిలెన్స్ నివేదికలు కవిత వద్దకు ఎలా వెళ్తాయి..? : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Bael Tree | మారేడు చెట్టు కింద ఆ పనిచేస్తే నిరుపేద కూడా సంపన్నుడు అవుతాడట తెలుసా..!
AP News | ఉత్తరాంధ్రకు మళ్లీ తుపాను ముప్పు.. 18, 19 తేదీల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్..!
Master Bharat | నటనకు దూరమవుతున్నాననే వార్తల్లో ఎలాంటి నిజం లేదు.. క్లారిటీ ఇచ్చిన మాస్టర్ భరత్
ట్రెండింగ్ వార్తలు
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?

