Ashok Galla | న్యూ ఇయర్ కానుకగా అశోక్ గల్లా ‘VISA – వింటారా సరదాగా’!
VISA | నూతన సంవత్సరానికి వినోదభరితమైన స్వాగతం పలుకుతూ, యువ హీరో అశోక్ గల్లా మరియు శ్రీ గౌరీ ప్రియ జంటగా నటిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘VISA – వింటారా సరదాగా’ ప్రపంచవ్యాప్తంగా జనవరి 1, 2027న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.
VISA | నూతన సంవత్సరానికి వినోదభరితమైన స్వాగతం పలుకుతూ, యువ హీరో అశోక్ గల్లా మరియు శ్రీ గౌరీ ప్రియ జంటగా నటిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘VISA – వింటారా సరదాగా’ ప్రపంచవ్యాప్తంగా జనవరి 1, 2027న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ప్రేమ, స్నేహం, సరదా, మరియు యువత జీవితంలోని మధురమైన అనుభవాల సమ్మేళనంగా తెరకెక్కిన ఈ చిత్రం, నూతన సంవత్సర వేడుకల్లో ప్రేక్షకులకు చక్కటి వినోదాన్ని పంచనుంది. ఉద్భవ్ రఘు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అమెరికా నేపథ్యంలో సాగనుంది. ఉన్నత చదువులు, పెద్ద కలలతో స్వదేశాన్ని వీడి అమెరికాకు వెళ్ళిన తెలుగు విద్యార్థుల జీవితాల చుట్టూ ఈ కథనం తిరుగుతుంది. విదేశాల్లో విద్యార్థుల జీవనశైలి, వారి స్నేహాలు, ప్రేమలు, అనుకోని పరిణామాలు మరియు ఎదురయ్యే ఆసక్తికరమైన సంఘటనలను దర్శకుడు ఎంతో వినోదాత్మకంగా ఈ చిత్రంలో ఆవిష్కరించారు.
ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు మరియు టీజర్లు సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి. అశోక్ గల్లా, శ్రీ గౌరీ ప్రియల ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మరోవైపు, ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ కూడా సోషల్ మీడియాలో మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాయి. విజయ్ బుల్గానిన్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు శ్రోతలను అలరిస్తున్నాయి. ముఖ్యంగా సంజిత్ హెగ్డే ఆలపించిన ‘అనగా అనగా అమెరికా’ పాటలో ప్రేమ, కొత్తదనం ఉట్టిపడగా.. సిద్ శ్రీరామ్, లిప్సిక గాత్రం అందించిన ‘చింగారి’ పాట లవర్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో అశోక్ గల్లా, శ్రీ గౌరీ ప్రియ ప్రధాన పాత్రల్లో కనిపించనుండగా.. రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్, సత్య, వివా హర్ష, గుండు సుదర్శన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌పై సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. యూత్‌ఫుల్ లవ్, ఫన్ అండ్ ఫ్రెండ్షిప్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ‘VISA – వింటారా సరదాగా’ సినిమాతో ప్రేక్షకులు 2027 కొత్త సంవత్సరానికి గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పనున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ashok Galla | న్యూ ఇయర్ కానుకగా అశోక్ గల్లా ‘VISA – వింటారా సరదాగా’!
Om Telugu Trailer | ధనుష్ ‘ఓం’ తెలుగు ట్రైలర్ విడుదల.. నవంబర్ 20న థియేటర్లలోకి!
HoloCoder | ఇక చీకట్లోనూ క్లియర్ ఫొటోలు.. మెగాపిక్సెల్‌తో సంబంధం లేకుండా కెమెరా పనితీరు పెంచే టెక్నాలజీ వచ్చేసింది!
Ramayana | ‘ఛావా’ రికార్డు బద్దలు.. కేవలం 9 రోజుల్లో రూ. 1100 కోట్ల క్లబ్లో ‘రామాయణం’!
Cancer | 50 రకాల క్యాన్సర్లను ముందుగానే గుర్తించే కొత్త రకమైన పరీక్ష.. ఏంటిది.. క్యాన్సర్‌ను ఎలా గుర్తిస్తుంది..?
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

