Vaibhav Sooryavanshi: మెన్స్ టీ20 క్రికెట్లో యంగెస్ట్ కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ రికార్డు
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ పేరిట మరో రికార్డు నమోదు అయ్యింది. పురుషుల టీ20 క్రికెట్లో నాయకత్వం వహించిన అతిపిన్న వయసున్న కెప్టెన్‌గా వైభవ్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. గతంలో క్రొయేషియా క్రికెటర్ జాచ్ వుకుసిక్ పేరిట ఉన్న రికార్డును వైభవ్ బ్రేక్ చేశాడు.
ఇండోర్: యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ(Vaibhav Sooryavanshi) పేరిట మరో రికార్డు నమోదు అయ్యింది. పురుషుల టీ20 క్రికెట్లో ఓ జట్టుకు నాయకత్వం వహించిన అతిపిన్న వయసున్న కెప్టెన్‌గా వైభవ్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. గతంలో క్రొయేషియా క్రికెటర్ జాచ్ వుకుసిక్ పేరిట ఉన్న రికార్డును వైభవ్ బ్రేక్ చేశాడు. ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో భాగంగా ఇవాళ బీహార్, సౌరాష్ట్ర మధ్య మ్యాచ్ జరుగుతోంది. అయితే గత శుక్రవారమే సూర్యవంశీని బీహార్ కెప్టెన్‌గా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక నేటితో వైభవ్ సూర్యవంశీ వయసు 15 ఏళ్ల 232 రోజులు. గతంలో క్రొయేషియా క్రికెటర్ జాచ్ 17 ఏళ్ల 311 రోజుల వయసులో ఆ దేశ కెప్టెన్‌గా బాధ్యత నిర్వర్తించాడు. దీంతో ఇప్పుడు యంగెస్ట్ కెప్టన్‌గా వైభవ్ రికార్డు క్రియేట్ చేశాడు.
వైభవ్ కెరీర్లో ఇవాళ కొత్త మైలురాయి చోటుచేసుకున్నది. కేవలం 5 నెలల క్రితమే అతను భారత జట్టు తరపున టీ20 మ్యాచ్ ఆడిన విషయం తెలిసిందే. ఇక ఏడాది క్రితమే జింబాబ్వేలో జరిగిన అండర్ 19 వరల్డ్‌కప్‌లో భారత్‌ను గెలిపించాడతను. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో వైభవ్ మరో మ్యాచ్ ఆడనున్నాడు. ఆ తర్వాత అతను దోహాలో జరిగే రైజింగ్ స్టార్స్ టోర్నీలో ఇండియా ఏ జట్టుతో జతకలవనున్నాడు. ఇండోర్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో బీహార్ ముందుగా బ్యాటింగ్ చేసింది. వైభవ్ కేవలం 18 రన్స్ మాత్రమే చేసి తన వికెట్‌ను సమర్పించుకున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaibhav Sooryavanshi: మెన్స్ టీ20 క్రికెట్లో యంగెస్ట్ కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ రికార్డు
దిష్టిబొమ్మ దహనం.. ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లకు గాయాలు
SpaceX: అతిపెద్ద రాకెట్‌ను ప్రయోగించిన స్పేస్ఎక్స్.. పేలిన ఫస్ట్ స్టేజ్ బూస్టర్
Ashok Galla | న్యూ ఇయర్ కానుకగా అశోక్ గల్లా ‘VISA – వింటారా సరదాగా’!
Om Telugu Trailer | ధనుష్ ‘ఓం’ తెలుగు ట్రైలర్ విడుదల.. నవంబర్ 20న థియేటర్లలోకి!
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

