Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
Hindu names on Muslim wedding cards | ముస్లిం కుటుంబానికి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లకు అదే మతానికి చెందిన ఇద్దరు వ్యక్తులతో పెళ్లి నిశ్చియమైంది. అయితే వెడ్డింగ్ కార్డులలో ఆ ముస్లిం వరుల పేర్లను హిందూ పేర్లుగా పేర్కొన్నారు. హిందూ సంఘాల దృష్టికి ఇది వెళ్లింది. దీంతో ఆ నిఖాను రద్దు చేయాలని కొందరు వ్యక్తులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు రక్షణ కల్పించారు.
లక్నో: ముస్లిం కుటుంబానికి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లకు అదే మతానికి చెందిన ఇద్దరు వ్యక్తులతో పెళ్లి నిశ్చియమైంది. అయితే వెడ్డింగ్ కార్డులలో ఆ ముస్లిం వరుల పేర్లను హిందూ పేర్లుగా పేర్కొన్నారు. హిందూ సంఘాల దృష్టికి ఇది వెళ్లింది. దీంతో ఆ నిఖాను రద్దు చేయాలని కొందరు వ్యక్తులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు రక్షణ కల్పించారు. (Hindu names on Muslim wedding cards) ఉత్తరప్రదేశ్‌లోని సహారన్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గంగోహ్లోని ఒక ముస్లిం కుటుంబానికి చెందిన అక్కాచెల్లెళ్లకు హర్యానాలోని ముస్లిం కుటుంబాలకు చెందిన కజిన్స్ యువకులతో పెళ్లి సంబంధం కుదిరింది. దీంతో ఆ ఇద్దరు వరులు తమ కుటుంబాలతో కలిసి పెళ్లి ఊరేగింపుగా గంగోహ్ చేరుకున్నారు. వధువుల కుటుంబ సభ్యులు వారికి స్వాగతం పలికారు.
కాగా, ముస్లింలైన ఇద్దరు వరుల పేర్లు ‘అనిల్, సంజయ్’ అని వెడ్డింగ్ కార్డులో ఉన్నది. సోషల్ మీడియాలో ఇది వైరల్ కావడంతో దీనిపై వివాదం చెలరేగింది. ముస్లిం యువకులకు హిందువుల పేర్లు ఉండటంపై స్థానిక హిందూ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. హిందూ సురక్షా సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు రోహిత్ ప్రధాన్, మరో వ్యక్తి కలిసి ఆ పెళ్లి వేడుక జరిగే ఫంక్షన్ హాల్ నిర్వాహకుడికి ఫోన్ చేశారు. హిందూ పేర్లు ఉన్న ముస్లిం యువకుల పెళ్లి బుకింగ్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వారి నిఖాను అడ్డుకుంటామని వారు బెదిరించారు.
మరోవైపు ఈ విషయం తెలుసుకున్న ముస్లిం వధూవరుల కుటుంబాలు గంగోహ్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. ముస్లిం కుటుంబాలకు చెందిన తమ పిల్లలకు హిందూ పేర్లు పెట్టే సంప్రదాయం 1947 నాటి దేశ విభజన నాటిదని వరుల కుటుంబ సభ్యులు పోలీసులకు వివరించారు. దేశ విభజన సమయంలో హర్యానాలోని తమ గ్రామంలో ఉన్న హిందూ కుటుంబాలు తమ పూర్వీకుల ముస్లిం గుర్తింపును దాచిపెట్టారని, వారిని హిందువులుగా పరిచయం చేసి వారి ప్రాణాలను కాపాడినట్లు తెలిపారు. దీంతో హిందూ కుటుంబాలు చూపిన సోదరభావం, సహాయానికి గుర్తుగా తమ పిల్లలకు హిందూ సంప్రదాయాల ప్రకారం పేర్లు పెట్టడం ప్రారంభించినట్లు ముస్లిం వరుల కుటుంబాలు వెల్లడించాయి.
అలాగే ఈ వివాహాన్ని అడ్డుకుంటామని బెదిరించిన వ్యక్తులపై ముస్లిం వధువుల కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సున్నిత అంశం నేపథ్యంలో వివాహ వేడుక వద్ద రక్షణ కల్పించాలని కోరారు. ఈ నేపథ్యంలో ఆ ఫంక్షన్ హాల్ వద్ద పోలీసులను మోహరించారు. శాంతిభద్రతలకు భంగం కలిగించడానికి లేదా వివాహ వేడుకకు ఆటంకం కలిగించడానికి ప్రయత్నించే ఎవరిపైనైనా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారి హెచ్చరించారు. దీంతో ఎలాంటి ఆటంకాలు లేకుండా ‘అనిల్, సంజయ్’ అని హిందువుల పేర్లు కలిగిన హర్యానా ముస్లిం వరులతో ఇద్దరు ముస్లిం సోదరీమణుల వివాహాలు పూర్తయ్యాయి. ఈ పెళ్లి వేడుకకు పలువురు ప్రముఖలు కూడా హాజరయ్యారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Cancel
- Hindu names
- muslim
- nikaha
RELATED ARTICLES
తాజా వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
Jayannth & The Jingo Pen | దిల్ రాజు చేతుల మీదుగా ‘జయంత్ అండ్ ది జింగో పెన్’ నుంచి ‘నా కనుపాపే’ సాంగ్ విడుదల
Vaccine | చిన్నతనంలో కొన్ని టీకాలు వేయించుకోని వారు పెద్దయ్యాక తీసుకోవచ్చా.. వైద్య నిపుణులు ఏం చెబుతున్నారు..?
పేదలకు పెన్షన్లే ఆర్థిక భరోసా : ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
మస్కట్‌లో మోసానికి గురై స్వదేశానికి చేరుకున్న లక్ష్మి కుటుంబానికి అండగా నిలిచిన మాజీ ఎమ్మెల్యే
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

