Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
BJP MLA Kissing Man | మీడియా సమావేశంలో మంత్రి ప్రసంగిస్తుండగా ఒక బీజేపీ ఎమ్మెల్యే తన పక్కన ఉన్న వ్యక్తిని ముద్దు పెట్టుకున్నారు. అతడిని కౌగిలించునేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్లుగా ఉన్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే అది ఏఐ వీడియో అని ఆ ఎమ్మెల్యే భార్య ఆరోపించారు.
భువనేశ్వర్: మీడియా సమావేశంలో మంత్రి ప్రసంగిస్తుండగా ఒక బీజేపీ ఎమ్మెల్యే తన పక్కన ఉన్న వ్యక్తిని ముద్దు పెట్టుకున్నారు. అతడిని కౌగిలించునేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్లుగా ఉన్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే అది ఏఐ వీడియో అని ఆ ఎమ్మెల్యే భార్య ఆరోపించారు. (BJP MLA Kissing Man) బీజేపీ పాలిత ఒడిశాలో ఈ సంఘటన జరిగింది. గురువారం గంజాం జిల్లాలో వరద ప్రభావంపై మత్స్య, పశు వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గోకులానంద మాలిక్ మీడియాతో మాట్లాడారు. 2024లో మొదటిసారి అసెంబ్లీకి ఎన్నికైన చికితీ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే మనోరంజన్ ద్యాన్ సమంత్రా, ఆ మంత్రి వెనుక నిల్చొని ఉన్నారు. అయితే పక్కనే ఉన్న వ్యక్తిని ముద్దు పెట్టుకోవడానికి, కౌగిలించుకోవడానికి ఆయన ప్రయత్నిస్తున్నట్లుగా ఉన్న ఒక వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కాగా, ఒడిశాలోని ప్రతిపక్ష బీజేడీ ఈ వీడియో క్లిప్‌ను ఎక్స్‌లో షేర్ చేసింది. ‘గంజాం జిల్లా వరదల్లో మునిగిపోతుంటే, బీజేపీ నాయకులు మాత్రం ఆనందంతో గెంతుతున్నారు’ అని విమర్శించింది. అయితే బీజేపీ అధికార ప్రతినిధితో పాటు ఆ ఎమ్మెల్యే కూడా ఈ వీడియో క్లిప్‌పై స్పందించలేదు.
మరోవైపు బీజేపీ ఎమ్మెల్యే మనోరంజన్ ద్యాన్ సమంత్రా భార్య మీనా సాహు ఈ వీడియోపై స్పందించారు. వైరల్ అవుతున్న ఈ క్లిప్‌ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఉపయోగించి మార్ఫింగ్ చేశారని ఆమె ఆరోపించారు. అదే విలేకరుల సమావేశానికి సంబంధించిన మరో వీడియోను ఎక్స్‌లో షేర్ చేశారు. అదే అసలైన ఫుటేజ్ అని, మంత్రి ప్రసంగాన్ని ఎమ్మెల్యే చాలా శ్రద్ధగా వింటున్నారని ఆమె పేర్కొన్నారు.
అలాగే ఎమ్మెల్యే మనోరంజన్ ద్యాన్ సమంత్రా ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఏఐ సాంకేతికతతో సృష్టించిన వీడియో క్లిప్‌ను బీజేడీకి చెందిన చికితీ సోషల్ మీడియా బృందం ప్రచారం చేస్తోందని ఆయన భార్య మీనా ఆరోపించారు. దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బెర్హంపూర్ పోలీసులను ఆమె కోరారు.
ଗଞ୍ଜାମ ଭାସିଗଲା ବନ୍ୟାରେ 😢
ବିଜେପି ନେତା ଉଛୁଳୁଛନ୍ତି ଖୁସିରେ 😠#Ganjam #CycloneArnab #BJPAntiPeople #ହଟାଅବିଜେପି #JababMaguchiOdisha https://t.co/EEIux6zSfD
— Biju Janata Dal (@bjd_odisha) November 13, 2026
This is the real video of chikti MLA @DyanSama in which he is patiencely listening to the minister but the bjd chikti social media had make AI video and made chikti MLA offended in social media. Being wife of @DyanSama i request @SP_BRAHMAPUR to take strict action against these goons.
— Mina Dyan Samantara (@dyan_mina) November 13, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- AI Clip
- Allege
- BJP MLA
- Kissing Man
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Bael Tree | మారేడు చెట్టు కింద ఆ పనిచేస్తే నిరుపేద కూడా సంపన్నుడు అవుతాడట తెలుసా..!
AP News | ఉత్తరాంధ్రకు మళ్లీ తుపాను ముప్పు.. 18, 19 తేదీల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్..!
Master Bharat | నటనకు దూరమవుతున్నాననే వార్తల్లో ఎలాంటి నిజం లేదు.. క్లారిటీ ఇచ్చిన మాస్టర్ భరత్
RS Praveen Kumar | కాంగ్రెస్ పార్టీకి నాలుగో అనుబంధ సంస్థ తెలంగాణ రక్షణ సేన : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?

