man, son found dead at home | వ్యక్తి, ఐదేళ్ల కుమారుడు ఇంట్లో మృతి.. భార్యపై పోలీసులు అనుమానం
man, son found dead at home | ఒక వ్యక్తి, ఐదేళ్ల కుమారుడు ఇంట్లో అనుమానాస్పదంగా మరణించారు. అతడి భార్య పోలీసులకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పింది. అయితే ఆ వ్యక్తి శరీరంపై గాయాలు ఉండటంతో అతడి భార్యను పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
బెంగళూరు: ఒక వ్యక్తి, ఐదేళ్ల కుమారుడు వారి ఇంట్లో అనుమానాస్పదంగా మరణించారు. అతడి భార్య పోలీసులకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పింది. అయితే ఆ వ్యక్తి శరీరంపై గాయాలు ఉండటంతో అతడి భార్యను పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. (man, son found dead at home) కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. 38 ఏళ్ల అభినందన్ ఒక ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. భార్య అయిన 26 ఏళ్ల హరిణి, ఐదేళ్ల కుమారుడు యదువీర్‌తో కలిసి చిక్కబనవర ప్రాంతంలోని ఒక ఇంట్లో నివసిస్తున్నాడు.
కాగా, ఆదివారం ఆ కుటుంబం తమ బంధువుల ఇంటికి వెళ్లినట్లు తెలుస్తున్నది. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత అభినందన్, భార్య హరిణి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో వారిద్దరూ వేర్వేరు గదుల్లో నిద్రించారు. అయితే అభినందన్, ఐదేళ్ల కుమారుడు అనుమానాస్పదంగా మరణించారు.
మరోవైపు సోమవారం తెల్లవారుజామున హరిణి పోలీసులకు సమాచారం ఇచ్చింది. తన భర్త, కుమారుడు బెడ్‌పై నిద్రపోతూ విగతజీవులుగా కనిపించినట్లు చెప్పింది. దీంతో పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. వారిద్దరి మృతదేహాలను పరిశీలించారు. అభినందన్ శరీరంపై గాయాల గుర్తులను పోలీసులు గుర్తించారు. అయితే కత్తిపోటు గాయాలు ఏవీ కనిపించలేదు. తండ్రీ, కుమారుల మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కాగా, భార్య హరిణిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అభినందన్, హరిణి మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వారిద్దరి కాల్ రికార్డులను పరిశీలించారు. హరిణి మొబైల్ ఫోన్లో ఒక ఫ్రెండ్ ఫోన్ నంబర్‌ను పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో అభినందన్, ఐదేళ్ల కుమారుడి అనుమానాస్పద మరణం వెనుక ఏదైనా నేరపూరిత చర్య ఉండవచ్చని అనుమానిస్తున్నారు. దీంతో హరిణిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Bengaluru
- body
- bruises
- Found Dead
RELATED ARTICLES
తాజా వార్తలు
అనధికారిక యూటర్న్‌తో ప్రమాదాలు
Rajnath Singh | ఈసారి తీవ్రవాద దాడి జరిగితే తీవ్రంగా స్పందిస్తాం.. పాకిస్తాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక
చికిత్స పేరుతో మహిళకు వేధింపులు.. వైద్యుడి అరెస్ట్
ACB Net | రూ.8వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ తహసీల్దార్
Srilanka Cricket | ముక్కోణపు వన్డేలకు ఓపెనర్ దూరం.. అన్క్యాప్డ్ కుర్రాడికి భలే అవకాశం..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

