మీరు ఆనందంగా ఎందుకు లేరంటే?
ఇప్పటి పరిస్థితులు ఒకప్పటిలా లేవు. తినడానికి తిండీ, ఉండటానికి గూడూ, కట్టుకోవడానికి దుస్తులూ అన్నవి అందరికీ సర్వసాధారణంగా దొరుకుతున్న విషయాలే. మనిషి కనీస అవసరాలు తీరాక కూడా ‘నేను ఆనందంగా ఉన్నాను’ అని చెప్పే వ్యక్తులు అరుదుగా కనిపిస్తున్నారు. విద్యాధికులు, ఉద్యోగుల్లోనూ సంతృప్తిగా జీవించే వారి సంఖ్య నూటికీ కోటికీ ఒక్కరులా తయారైంది. దీనికి కారణాలు చాలానే ఉన్నా, ఐదు కారణాలు మాత్రం ప్రముఖంగా కనిపిస్తాయి. వీటిని గమనిస్తే మన ఆనందాన్ని చెడగొట్టే పనులన్నీ స్వయంకృతాలే అనిపిస్తాయి!
ఇప్పటి పరిస్థితులు ఒకప్పటిలా లేవు. తినడానికి తిండీ, ఉండటానికి గూడూ, కట్టుకోవడానికి దుస్తులూ అన్నవి అందరికీ సర్వసాధారణంగా దొరుకుతున్న విషయాలే. మనిషి కనీస అవసరాలు తీరాక కూడా ‘నేను ఆనందంగా ఉన్నాను’ అని చెప్పే వ్యక్తులు అరుదుగా కనిపిస్తున్నారు. విద్యాధికులు, ఉద్యోగుల్లోనూ సంతృప్తిగా జీవించే వారి సంఖ్య నూటికీ కోటికీ ఒక్కరులా తయారైంది. దీనికి కారణాలు చాలానే ఉన్నా, ఐదు కారణాలు మాత్రం ప్రముఖంగా కనిపిస్తాయి. వీటిని గమనిస్తే మన ఆనందాన్ని చెడగొట్టే పనులన్నీ స్వయంకృతాలే అనిపిస్తాయి!
కృతజ్ఞతా భావం లేకపోవడం
మనకు ఎన్నో ఇచ్చిన ప్రపంచంపై కృతజ్ఞతతో లేకపోవడం ఆనందానికి దూరమవడానికి ముఖ్య కారణం. ఏ అవకరం లేని శరీరం, తినడానికి, ఉండటానికి లోటులేకపోవడం లాంటి మంచి విషయాలను పక్కన పెట్టి ఎప్పుడూ ఫిర్యాదులు చేస్తూ జీవిస్తుంటారు కొంతమంది. ఒక మంచి కారు, పెద్ద ఇల్లు కొనుక్కుంటేనే సంతోషంగా ఉన్నట్టని భావిస్తారు. అంటే ప్రస్తుతానికి వాళ్ల సంతోషాన్ని ఐదారేండ్లు వాయిదా వేస్తున్నారన్నమాట. పోనీ ఐదేండ్లకు ఇల్లు కొనుక్కున్నా.. అప్పుడు మరో సమస్యను వీళ్లే కనిపెడతారు. ఇది ఒక అంతంలేని ప్రక్రియ. అందుకే ఇలాంటి కోరికల్ని పక్కన పెట్టి ఈ క్షణం మీరు ఆనందించడానికి ఉన్న కారణాల్ని వెతుక్కోండి. అందుకు కారణమైనవాటి పట్ల కృతజ్ఞతతో ఉండండి.
ఇతరులతో పోల్చుకోవడం
మన స్నేహితులతోనో, దగ్గరి బంధువులతోనో పోల్చుకుంటున్నామంటే మనల్ని మనం బాధించుకుంటున్నట్టే. నిజానికి పుట్టిన దగ్గరినుంచీ పోయే దాకా ఏ ఇద్దరి జీవితాలూ ఒకేలా ఉండవు. అలాంటప్పుడు ఒకరు పెద్ద ఉద్యోగంలో ఉన్నారనో, మరొకరికి బోలెడు బంగారం ఉందనో, ఇంకొకరి పిల్లలు పెద్ద బళ్లలో చదువుతున్నారనో ఎందుకు పోల్చుకోవడం. ఈర్ష్య, బాధ ఉన్నచోట సంతోషానికి చోటుండదు. అందుకే మన పరిస్థితులు ఏంటి, మన అర్హతను పెంచుకునేందుకు ఏమి చేయగలం అన్న ఆలోచన చేస్తూ ఉన్నదాంట్లో సంతోషంగా జీవించడం అలవాటు చేసుకోవాలి.
వైఫల్యాలను అంగీకరించకపోవడం
మనం చాలా విషయాల్లో వైఫల్యం చెందుతాం. అనుకున్నది సాధించలేకపోతాం. అప్పుడు బాధ్యత తీసుకుని ఇలా ఎందుకు జరిగిందో ఆలోచించుకుని ఆ తప్పు పునరావృతం కాకుండా చూసుకుంటే ముందుకుపోగలం. కానీ, ఆ ఓటమికి ఎవర్నో బాధ్యుల్ని చేయడం, పరిస్థితుల్ని నిందించడం లాంటివి చేస్తే ఎప్పటికీ మనం కోలుకోలేం. సంతోషాన్ని అందుకోలేం.
పర్ఫెక్షన్ పిచ్చి వద్దు
మనం ఏదైనా పనిచేసేప్పుడు బాగా చేయాలని కోరుకుంటాం. తప్పులేదు. కానీ అది పర్ఫెక్ట్… ఇంతకన్నా ఎవరూ బాగా చేయలేరు.. అని అనిపించుకునేలా చేయాలని కోరుకోవద్దు. మీరు ఏదన్నా నేర్చుకుంటున్నారా… ఆసక్తితో నేర్చుకోండి. ఆ విషయంలో చేతనైనంత కృషి చేయండి. ఆ పని 100 శాతం అద్భుతంగా రావాలని
అనుకోకండి, మీరు దాన్ని పూర్తి చేయడానికి 100 శాతం ప్రయత్నం మాత్రం చేయండి. మీ ప్రయత్నం, కృషి మాత్రమే సంతోషాన్ని ఇస్తాయని గుర్తించండి.
జనంలో కలవండి
టీనేజర్లూ, యువతలో సంతోషంగా ఉండేవారి శాతం గణనీయంగా తగ్గిపోతున్నదని అధ్యయనాలు చెబుతున్నాయి. దీనికి కారణం శ్రుతి మించిన స్మార్ట్ఫోన్లాంటి ఎలక్ట్రానిక్ పరికరాల వాడకం. గ్యాడ్జెట్లు వచ్చాక మనుషులు మనుషులతో గడిపే సమయం బాగా తగ్గిపోయింది. మనుషులు ఎంత ఎక్కువ సమయం గ్యాడ్జెట్లతో గడిపితే అంత ఎక్కువగా చిరాకు పడుతున్నారని, ఒత్తిడికి గురవుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే వర్చ్యువల్ ప్రపంచం నుంచి బయటికి వచ్చి ఒకసారి సాధారణ ప్రపంచంలో, మనుషులతో కలవండి. అప్పుడే అసలైన ఆనందాన్ని సొంతం చేసుకోగలరు.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

