ఉపాధ్యాయులకే రక్షణ లేకుంటే విద్యార్థుల భవిష్యత్‌కు భరోసా ఎక్కడ?
ఉపాధ్యాయులకే రక్షణ లేని సమాజంలో విద్యార్థుల భవిష్యత్‌కు భరోసా ఎక్కడ ఉంటుందని జూలూరుపాడు మండల విద్యాధికారి ఝుంకిలాల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని ప్రభుత్వ కళాశాలలో పని చేస్తున్న లెక్చరర్‌పై విద్యార్థి తీవ్రంగా దాడి...
– లెక్చరర్‌పై విద్యార్థి దాడి అత్యంత బాధాకరం
– జూలూరుపాడు ఎంఈఓ ఝుంకిలాల్
– పడమట నర్సాపురం పాఠశాలలో ఉపాధ్యాయుల నిరసన
జూలూరుపాడు, నవంబర్ 28 : ఉపాధ్యాయులకే రక్షణ లేని సమాజంలో విద్యార్థుల భవిష్యత్‌కు భరోసా ఎక్కడ ఉంటుందని జూలూరుపాడు మండల విద్యాధికారి ఝుంకిలాల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని ప్రభుత్వ కళాశాలలో పని చేస్తున్న లెక్చరర్‌పై విద్యార్థి తీవ్రంగా దాడి చేసి మృతికి కారణం కావడాన్ని నిరసిస్తూ, శనివారం పడమట నర్సాపురం పాఠశాలలో భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి ఉపాధ్యాయులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంఈఓ ఝుంకిలాల్ మాట్లాడుతూ.. విద్యాబుద్ధులు నేర్పే అధ్యాపకుడిపై విద్యార్థి దాడికి పాల్పడటం అత్యంత బాధాకరమైన, ఆందోళన కలిగించే సంఘటన అని పేర్కొన్నారు. నేటి సమాజంలో పిల్లల్లో మానవతా విలువలు, నైతిక విలువలు, సామాజిక బాధ్యతతో పాటు గురువుల పట్ల గౌరవం ఎందుకు తగ్గిపోతున్నాయనే అంశంపై ప్రతి ఒక్కరూ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
మృతి చెందిన అధ్యాపకుడి కుటుంబానికి ఎవరు భరోసా కల్పిస్తారని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి అవాంఛనీయ ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థి దాడిలో ప్రాణాలు కోల్పోయిన అధ్యాపకుడి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని, ఈ ఘటనకు కారణమైన విద్యార్థికి చట్టపరంగా కఠిన శిక్ష విధించాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో ఉపాధ్యాయులు ప్రభాకర్ రావు, లింగయ్య, రాణి, రమణమ్మ, రమేష్, సుధాకర్ రెడ్డి, మాన్సింగ్, నర్సింహ, రాందాస్ పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఉపాధ్యాయులకే రక్షణ లేకుంటే విద్యార్థుల భవిష్యత్‌కు భరోసా ఎక్కడ?
Legacy | షూటింగ్ పూర్తి చేసుకున్న విశ్వక్ సేన్ ‘లెగసీ’.. 2027 ఫిబ్రవరిలో గ్రాండ్ రిలీజ్!
ఏఐఎస్ఎఫ్ జూలూరుపాడు మండల నూతన కమిటీ
కారేపల్లి మండల గిరిజన బిడ్డలకు కాకతీయ యూనివర్సిటీ గోల్డ్ మెడల్స్
Deepam lit atop Deepathoon | తిరుపరంకుండ్రం కొండపైన రాతి స్తంభంపై.. ఎట్టకేలకు వెలిగిన కార్తీక దీపం
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

