ఏఐఎస్ఎఫ్ జూలూరుపాడు మండల నూతన కమిటీ
అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) జూలూరుపాడు మండల నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. జూలూరుపాడులోని వికాస్ డిగ్రీ కళాశాలలో శనివారం ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి గుగులోత్ వంశీ అధ్యక్షతన నిర్వహించిన మండల మహాసభలో...
– మండల అధ్యక్షుడిగా బానోత్ దినేష్, కార్యదర్శిగా గుగులోతు అనిల్
జూలూరుపాడు, నవంబర్ 28 : అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) జూలూరుపాడు మండల నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. జూలూరుపాడులోని వికాస్ డిగ్రీ కళాశాలలో శనివారం ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి గుగులోత్ వంశీ అధ్యక్షతన నిర్వహించిన మండల మహాసభలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా నరసాపురం గ్రామానికి చెందిన బానోత్ దినేష్, మండల కార్యదర్శిగా మాచినేనిపేట గ్రామానికి చెందిన గుగులోతు అనిల్‌తో పాటు మరో 23 మంది సభ్యులతో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ మహాసభకు ముఖ్య అతిథిగా హాజరైన ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి వరక అజిత్ మాట్లాడుతూ, ఏఐఎస్ఎఫ్ నాటి నుంచి నేటి వరకు విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం అలుపెరగని పోరాటాలు చేస్తోందన్నారు. చదువుతూ పోరాడు.. చదువుకై పోరాడు అనే నినాదంతో విద్యార్థులను చైతన్యవంతం చేస్తూ, దేశంలో శాస్త్రీయ విద్యా విధానం కోసం మొట్టమొదటగా గళమెత్తింది ఏఐఎస్ఎఫ్ మాత్రమేనని గుర్తు చేశారు. విద్యా వ్యాపారీకరణ, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విద్యార్థులంతా ఐక్యం కావాలని, అందుకు ఈ మండల మహాసభలు దోహదపడాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన మండల అధ్యక్ష, కార్యదర్శులను మండల కార్యదర్శి గుండు పిన్ని వెంకటేశ్వర్లు అభినందించారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఏఐఎస్ఎఫ్ జూలూరుపాడు మండల నూతన కమిటీ
కారేపల్లి మండల గిరిజన బిడ్డలకు కాకతీయ యూనివర్సిటీ గోల్డ్ మెడల్స్
Deepam lit atop Deepathoon | తిరుపరంకుండ్రం కొండపైన రాతి స్తంభంపై.. ఎట్టకేలకు వెలిగిన కార్తీక దీపం
Kaaka | సస్పెన్స్‌కు ఫుల్స్టాప్.. చిరంజీవి ‘కాకా’ను రిలీజ్ చేస్తుందెవరో తెలుసా..?
‘ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

