Deepam lit atop Deepathoon | తిరుపరంకుండ్రం కొండపైన రాతి స్తంభంపై.. ఎట్టకేలకు వెలిగిన కార్తీక దీపం
Deepam lit atop Deepathoon | తమిళనాడులోని మదురైలో తిరుపరంకుండ్రం కొండపై ఉన్న రాతి స్తంభంపై ఎట్టకేలకు కార్తీక దీపం వెలిగింది. సుప్రీంకోర్టు నియమించిన ఇద్దరు మాజీ హైకోర్టు న్యాయమూర్తుల సమక్షంలో శనివారం సాయంత్రం 5 గంటలకు వివాదస్పద ‘దీపథూన్’పై పూజారులు దీపం వెలిగించారు.
చెన్నై: తమిళనాడులోని మదురైలో తిరుపరంకుండ్రం కొండపై ఉన్న రాతి స్తంభంపై ఎట్టకేలకు కార్తీక దీపం వెలిగింది. సుప్రీంకోర్టు నియమించిన ఇద్దరు మాజీ హైకోర్టు న్యాయమూర్తుల సమక్షంలో శనివారం సాయంత్రం 5 గంటలకు వివాదస్పద ‘దీపథూన్’పై పూజారులు దీపం వెలిగించారు. (Deepam lit atop Deepathoon) చాలా కాలంగా కొనసాగుతున్న న్యాయ విచారణతో పాటు ఈ వివాదానికి ముగింపు పలికారు. అరుల్మిగు సుబ్రహ్మణ్యస్వామి ఆలయ నిర్వహణ కోసం సుప్రీంకోర్టు నియమించిన మేఘాలయ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎస్. వైద్యనాథన్, మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి వి. పార్థిబన్ శనివారం చెన్నై నుంచి తిరుపరంకుండ్రం చేరుకున్నారు. అరుల్మిగు సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. ఆ తర్వాత సాంప్రదాయ సంగీత వాయిద్యాల నడుమ మట్టి ప్రమిదలు, ఒత్తులు, నెయ్యిని కొండ పాదాల వద్దకు వారు తీసుకువచ్చారు. ఆలయ యంత్రాంగానికి వాటిని అందజేశారు. సుమారు 50 మంది భక్తులను అక్కడకు అనుమతించారు.
కాగా, తాత్కాలికంగా ఏర్పాటు చేసిన నిచ్చెనల ద్వారా మాజీ హైకోర్టు న్యాయమూర్తులు, పూజారులు ఆ రాతి స్తంభం పైకి చేరుకున్నారు. 50 మీటర్ల పొడవైన పత్తి వత్తి, 5 కిలోల కర్పూరం, 30 కిలోల నెయ్యి వినియోగించి కార్తీక దీపాన్ని వెలిగించారు. దీప స్తంభంపై జ్వాల కనిపించగానే భక్తుల నినాదాలతో ఆ ప్రాంతం మారుమోగింది. సంతోషంతో వారు సంబరాలు జరుపుకున్నారు.
మరోవైపు సీఆర్పీఎఫ్ సిబ్బంది శనివారం ఉదయమే అక్కడకు చేరుకుని భద్రతా ఏర్పాట్లు చేశారు. స్థానిక హిందువులు వారి వాహనాలపై పూలు చల్లి ఆహ్వానించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హజ్రత్ సుల్తాన్ సికందర్ బదుషా ఔలియా దర్గా చుట్టూ దీపాలు వెలిగించడానికి 50 మీటర్ల బఫర్ జోన్‌ను సీఆర్పీఎఫ్ ఏర్పాటు చేసింది.
కాగా, కార్తీక పౌర్ణమి సందర్భంగా నవంబర్ 24న వివాదస్పద దీప్థూన్ వద్ద కార్తీక దీపాన్ని వెలిగించేందుకు ఆలయ బోర్డుకు నవంబర్ 20న సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. అయితే ఆ రోజున కొండ దిగువన ఉన్న సాంప్రదాయ ప్రదేశంలో మాత్రమే దీపాన్ని వెలిగించారు. దీనిని కోర్టు ధిక్కారంగా సుప్రీంకోర్టు పరిగణించింది. తమిళనాడు ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఆ జిల్లా కలెక్టర్, ఎస్పీతో సహా 15 మందికి కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేయడంతో పాటు ఆలయ ధర్మకర్తల మండలిని సస్పెండ్ చేసింది. శనివారం ఎట్టిపరిస్థితుల్లోనూ తిరుపరంకుండ్రం కొండపై ఉన్న వివాదస్పద రాతి స్తంభంపై కార్తీక దీపం వెలిగించాలని శుక్రవారం అల్టిమేటం జారీ చేసింది.

Thiruparankundram Hill
అలాగే ఆలయం, దర్గా ఉన్న మొత్తం కొండ ప్రాంతానికి భద్రత కల్పించే బాధ్యతను సీఆర్పీఎఫ్కు సుప్రీంకోర్టు అప్పగించింది. దర్గా, మసీదులో ముస్లింల ప్రార్థనలకు ఎలాంటి ఆటంకాలు కలుగకుండా లేదా వారిని అడ్డుకోకుండా చూడాలని కేంద్ర బలగాలను ప్రత్యేకంగా ఆదేశించింది. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం కేరళ నుంచి వచ్చిన యాత్రికులతో సహా వంద మందికి పైగా ముస్లిం సందర్శకులు ఆ కొండపైకి చేరుకున్నారు. అక్కడి దర్గాలో వారు ప్రార్థనలు కూడా చేశారు.
#WATCH | Madurai, Tamil Nadu: The ceremonial Karthigai Deepam is lit at the Deepathoon stone pillar at Thiruparankundram Hill following the Supreme Court’s verdict under the supervision of retired High Court judges Justice S. Vaidyanathan and Justice V. Parthiban. https://t.co/Qpy6kHfVPj
— ANI (@ANI) November 28, 2026
#WATCH | Madurai, Tamil Nadu: Celebrations erupt with bursting firecrackers at Thiruparankundram hill as the ceremonial Deepam is lit following the Supreme Court’s verdict. https://t.co/Bf4ixqTzxN
— ANI (@ANI) November 28, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Atop
- Deepam lit
- Deepathoon
- Hill
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లి మండల గిరిజన బిడ్డలకు కాకతీయ యూనివర్సిటీ గోల్డ్ మెడల్స్
Deepam lit atop Deepathoon | తిరుపరంకుండ్రం కొండపైన రాతి స్తంభంపై.. ఎట్టకేలకు వెలిగిన కార్తీక దీపం
Kaaka | సస్పెన్స్‌కు ఫుల్స్టాప్.. చిరంజీవి ‘కాకా’ను రిలీజ్ చేస్తుందెవరో తెలుసా..?
‘ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి’
IAS Transfers | రాష్ట్రంలో ఎనిమిది మంది ఐఏఎస్‌ల బదిలీ.. ప్రత్యేక అధికారిగా సర్పరాజ్ నియామకం
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

