Legacy | షూటింగ్ పూర్తి చేసుకున్న విశ్వక్ సేన్ ‘లెగసీ’.. 2027 ఫిబ్రవరిలో గ్రాండ్ రిలీజ్!
Legacy | మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటిస్తున్న ఇంటెన్స్ పొలిటికల్ యాక్షన్ డ్రామా ‘లెగసీ’ చిత్రీకరణ విజయవంతంగా పూర్తయింది. ‘పిండం’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న సాయికిరణ్ రెడ్డి దైదా రచన, దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
Legacy | మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటిస్తున్న ఇంటెన్స్ పొలిటికల్ యాక్షన్ డ్రామా ‘లెగసీ’ చిత్రీకరణ విజయవంతంగా పూర్తయింది. ‘పిండం’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న సాయికిరణ్ రెడ్డి దైదా రచన, దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. కళాహి మీడియా బ్యానర్‌పై యశ్వంత్ దగ్గుమాటి, సాయికిరణ్ రెడ్డి దైదా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలోకి అడుగుపెట్టింది. నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతుండగా, 2027 ఫిబ్రవరిలో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
దర్శకుడు సాయికిరణ్ రెడ్డి దైదాకు, అలాగే కళాహి మీడియా సంస్థకు ఇది రెండో చిత్రం కావడం విశేషం. రాజకీయ నేపథ్యంలో సాగే ఈ కథ అధికారం, ఆశయం, కుటుంబ బంధాలు, ప్రేమ, ద్రోహం వంటి బలమైన భావోద్వేగాల చుట్టూ తిరుగుతుంది. తన తండ్రి రాజకీయ వారసత్వం కారణంగా అనూహ్య పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చిన ఓ వారసుడి జీవిత ప్రయాణాన్ని, రాజకీయాల ప్రభావం వ్యక్తిగత జీవితాలపై ఎలా ఉంటుందనే అంశాన్ని దర్శకుడు ఆసక్తికరంగా ఆవిష్కరించనున్నారు.
ఈ చిత్రంలో విశ్వక్ సేన్ మునుపెన్నడూ చూడని పవర్ఫుల్ అవతార్‌లో కనిపించనుండగా, బాలీవుడ్ ప్రముఖ నటుడు కే కే మీనన్ శక్తివంతమైన ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. ఏక్తా రాథోడ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో రావు రమేష్, సచిన్ ఖేడేకర్, మురళీ మోహన్, రాజా రవీంద్ర, రాజీవ్ కనకాల, అనీష్ కురువిల్లా, ఖుషీ రవి, కల్యాణి నటరాజన్, రవి కాలే, అమిత్ తివారి, కలెక్టర్ శ్రీనివాస్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన అనౌన్స్మెంట్ టీజర్, ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను పెంచాయి. గోవింద్ వసంత సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి జిజు సన్నీ ఛాయాగ్రహణం, శిరీష్ ప్రసాద్ కూర్పు, రాజీవ్ నాయర్ కళా దర్శకత్వం, స్టంట్ జాషువా యాక్షన్ కొరియోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఉపాధ్యాయులకే రక్షణ లేకుంటే విద్యార్థుల భవిష్యత్‌కు భరోసా ఎక్కడ?
Legacy | షూటింగ్ పూర్తి చేసుకున్న విశ్వక్ సేన్ ‘లెగసీ’.. 2027 ఫిబ్రవరిలో గ్రాండ్ రిలీజ్!
ఏఐఎస్ఎఫ్ జూలూరుపాడు మండల నూతన కమిటీ
కారేపల్లి మండల గిరిజన బిడ్డలకు కాకతీయ యూనివర్సిటీ గోల్డ్ మెడల్స్
Deepam lit atop Deepathoon | తిరుపరంకుండ్రం కొండపైన రాతి స్తంభంపై.. ఎట్టకేలకు వెలిగిన కార్తీక దీపం
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

