‘వైరాలో దీక్షా దివస్‌ను విజయవంతం చేయండి’
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక మలుపుగా నిలిచిన దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ నాయకుడు లకావత్ గిరిబాబు శనివారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత...
– బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ నాయకుడు లకావత్ గిరిబాబు పిలుపు
జూలూరుపాడు, నవంబర్ 28 : ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక మలుపుగా నిలిచిన దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ నాయకుడు లకావత్ గిరిబాబు శనివారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష మలిదశ తెలంగాణ ఉద్యమ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. నాటి ఉద్యమ స్ఫూర్తిని, తెలంగాణ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ ఇంచార్జ్ ఆర్జేసీ కృష్ణ ఆధ్వర్యంలో నవంబర్ 29 ఉదయం 10 గంటలకు వైరాలోని రింగ్ రోడ్డు సెంటర్, ఇండోర్ స్టేడియం ఎదురుగా దీక్షా దివస్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని అన్ని మండలాల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన కోరారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

