BJP IT Cell : బీజేపీ (BJP) సోమవారం నూతన జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించింది. ఇందులోభాగంగా పార్టీ జాతీయ ఐటీ సెల్ ఇన్‌ఛార్జి (IT Cell Chief) గా పనిచేసిన అమిత్ మాలవీయ (Amit Malviya) ను ఆ బాధ్యతల నుంచి తప్పించింది. ఛత్తీస్‌గఢ్ (Chattishgarh) కు చెందిన దీపక్ మాస్కే (Deepak Mhaskey) ను కొత్త సోషల్ మీడియా (Social Media) కన్వీనర్‌గా నియమించింది. అయితే పదేళ్లకుపైగా ఈ బాధ్యతలు నిర్వర్తించిన మాలవీయకు ఈసారి అవకాశం దక్కకపోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన పశ్చిమబెంగాల్లోనూ మాలవీయ పార్టీ కో-ఇన్ఛార్జిగా ఉన్నారు. దేశవ్యాప్తంగా తమ డిజిటల్, సోషల్ మీడియా కార్యకలాపాలను మరింత బలోపేతం చేసేందుకు కమలదళం ప్రయత్నిస్తున్న వేళ ఈ మార్పులు చోటుచేసుకున్నాయి. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన దీపక్.. రసాయన శాస్త్ర ప్రొఫెసర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. వ్యవసాయం, ఉద్యానవన రంగాల్లో అనుభవం ఉంది. ఎన్నికల డేటా, ప్రభుత్వ పథకాల విశ్లేషకుడిగా పనిచేశారు.
గతంలో ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ బోర్డులో కూడా మాలవీయ ఉన్నారు. ఛత్తీస్‌గఢ్ మెడికల్ సర్వీసెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఛైర్మన్‌గానూ వ్యవహరించారు. 2009 నుంచే ఆయనకు బీజేపీతో అనుబంధం ఉంది. పార్టీ ఛత్తీస్‌గఢ్ అధికార ప్రతినిధిగా ఉన్నారు. ఇదిలావుంటే.. ప్రీతి గాంధీ (మహారాష్ట్ర), శివానంద్ ద్వివేది (ఢిల్లీ), అలోక్ భట్ (ఉత్తరాఖండ్), అరుణ్ యాదవ్ (హర్యానా) లు సోషల్ మీడియా కో-కన్వీనర్లుగా నియమితులయ్యారు. కొత్త టీమ్‌కు అమిత్ మాలవీయ శుభాకాంక్షలు తెలిపారు.