Cell phones | పోగొట్టుకున్న ఫోన్లు అప్పగించిన పోలీసులు .. హర్షం వ్యక్తం చేసిన బాధితులు
పోగొట్టుకున్న ఫోన్లో రికవరీ చేసి బాధితులకు అప్పగించడంలో పాపన్నపేట పోలీసులు సిద్దిపేట జిల్లాలో ప్రథమ స్థానం నిలిచారు.
పాపన్నపేట , సెప్టెంబర్ 29 : పోగొట్టుకున్న ఫోన్లో రికవరీ చేసి బాధితులకు అప్పగించడంలో పాపన్నపేట పోలీసులు మెదక్ జిల్లాలో ప్రథమ స్థానం నిలిచారు. వివరాల్లోకెళ్తే గత కొంతకాలంగా వివిధ ప్రాంతాల్లో పోగొట్టుకున్న ఫోన్ల బాధితులు మీసేవ ద్వారా కంప్లైంట్ చేశారు. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఇప్పటివరకు 601 ఫోన్లను పోలీసులు గుర్తించగా అందులో 589 సెల్ ఫోన్లు ( 98 శాతం) రికవరీ చేసి బాధితులకు అందజేశారు.
మంగళవారం సైతం మరో 12 ఫోన్లు రికవరీ చేసి పోగొట్టుకున్న బాధితులకు ఫోన్లను అప్పగించారు. ఈ 12 ఫోన్ల విలువ రూ.2,4500 విలువ ఉంటుంది. పోగొట్టుకున్న ఫోన్లను అతి త్వరలోనే గుర్తించి రికవరీ చేసి బాధితులకు అందజేయడంలో పాపన్నపేట పోలీసులు జిల్లాలోని ప్రథమ స్థానంలో నిలిచారు. గతంలో సైతం పెద్ద ఎత్తున ఫోన్లు రికవరీ చేసి డిఎస్పి చేతుల మీదుగా అందజేశారు. పోయిన ఫోన్లను రికవరీ చేసి అందజేయడంతో బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- cell phones
- medak
- Papannapet
- Police
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

