Rajeev Kanakala | 25 ఏళ్ల ‘స్టూడెంట్ నెం.1’.. ఆ సినిమా లేకపోతే నా కెరీర్ ఇలా ఉండేది కాదు: రాజీవ్ కనకాల
Rajeev Kanakala | తెలుగు సినిమా చరిత్రలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న చిత్రాల్లో ‘స్టూడెంట్ నెం.1’ ఒకటి. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్‌కు బలమైన పునాది వేసిన ఈ సినిమా.. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి సినీ ప్రయాణానికి కూడా తొలి మెట్టుగా నిలిచింది. 2001 సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తాజాగా 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సినిమాలో కీలకమైన ‘సత్య’ పాత్రలో నటించిన రాజీవ్ కనకాల అప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ చేసిన ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Rajeev Kanakala | తెలుగు సినిమా చరిత్రలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న చిత్రాల్లో ‘స్టూడెంట్ నెం.1’ ఒకటి. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్‌కు బలమైన పునాది వేసిన ఈ సినిమా.. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి సినీ ప్రయాణానికి కూడా తొలి మెట్టుగా నిలిచింది. 2001 సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తాజాగా 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సినిమాలో కీలకమైన ‘సత్య’ పాత్రలో నటించిన రాజీవ్ కనకాల అప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ చేసిన ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘స్టూడెంట్ నెం.1’ తనకు కేవలం ఒక సినిమా కాదని, తన వ్యక్తిగత జీవితంతో పాటు నటుడిగా తన కెరీర్‌ను కూడా మలుపు తిప్పిన ప్రత్యేకమైన అధ్యాయమని రాజీవ్ కనకాల పేర్కొన్నారు. ఈ సినిమా తర్వాతే నటనను పూర్తిస్థాయి వృత్తిగా ఎంచుకుని సినీ రంగంలో కొనసాగాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు.
ముఖ్యంగా సినిమాలో తాను పోషించిన ‘సత్య’ పాత్రకు ప్రేక్షకుల నుంచి వచ్చిన ఆదరణను ఆయన గుర్తుచేసుకున్నారు. ఇప్పటికీ తాను ఎక్కడికి వెళ్లినా కొంతమంది తనను ‘సత్య’ పేరుతో గుర్తుపట్టి పలకరిస్తుంటారని, ఆ అనుభూతి తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని చెప్పుకొచ్చారు. తన కెరీర్లో ఎంతో కీలకమైన అవకాశాన్ని అందించిన దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళికి రాజీవ్ కనకాల ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తనకు గురువులాంటి దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు, తనకు ఎంతో ఇష్టమైన తారక్, సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి, నిర్మాతలు, చిత్ర బృందంలోని ప్రతి ఒక్కరినీ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.
‘స్టూడెంట్ నెం.1’ తనకు సినిమా మాత్రమే కాకుండా ఎంతో విలువైన స్నేహాలను కూడా అందించిందని రాజీవ్ పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ సినిమా చిత్రీకరణ సమయంలో జూనియర్ ఎన్టీఆర్‌తో ఏర్పడిన స్నేహం ఆ తర్వాత కూడా కొనసాగిందని, తదుపరి రోజుల్లో ఇద్దరూ కలిసి పలు సినిమాల్లో నటించడానికి ఆ అనుబంధమే కారణమైందని గుర్తుచేసుకున్నారు.సినిమా విడుదలకు ముందు ఎదురైన పరిస్థితులను కూడా రాజీవ్ కనకాల తన పోస్టులో గుర్తుచేసుకున్నారు. ‘స్టూడెంట్ నెం.1’ విజయం సాధించదని, సినిమా ఫ్లాప్ అవుతుందని అప్పట్లో కొందరు అభిప్రాయపడ్డారని తెలిపారు. అయితే ప్రేక్షకుల తీర్పు మాత్రం అందుకు పూర్తిగా భిన్నంగా ఉందన్నారు. ఒక సినిమా 25 ఏళ్లు పూర్తి చేసుకోవడం సాధారణ విషయం కాదని, ముఖ్యంగా తన జీవితంతో ఇంత బలమైన అనుబంధం ఉన్న సినిమా కావడంతో ‘స్టూడెంట్ నెం.1’ తనకు ఎప్పటికీ ప్రత్యేకంగానే ఉంటుందని రాజీవ్ కనకాల పేర్కొన్నారు.
25 Years of Student No.1 ❤️🎬
25 ఏళ్ల క్రితం వచ్చిన Student No.1… ఒక సినిమా మాత్రమే కాదు, నా జీవితంలో ఒక ప్రత్యేకమైన అధ్యాయం.
ఈ సినిమా తర్వాతే నేను పూర్తిగా సినిమాల్లోకి వచ్చాను. ‘సత్య’ అనే పాత్రతో ప్రేక్షకులకు దగ్గరయ్యాను. ఇప్పటికీ ఎక్కడికి వెళ్లినా ఆ పాత్ర గురించి గుర్తు… pic.twitter.com/cdlynlflls
— Raajeev kanakala (@RajeevCo) September 29, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

