Ashwin : వన్డే ప్రపంచకప్ కోసం స్క్వాడ్ ఎంపిక ఆసక్తి రేపుతోంది. సన్నాహక సిరీస్‌లో అదరగొట్టిన ఆటగాళ్లకే మెగా టోర్నీలో అవకాశం లభించనుంది. బ్యాటింగ్ యూనిట్‌పై కాసింత స్పష్టత వచ్చినా.. స్పిన్ దళంలో ఎవరు ఉంటారు? అనేది చర్చనీయాంశంగా మారంది. ఈ నేపథ్యంలో వెస్టిండీస్‌పై తొలి వన్డేలో సునాయస విజయం అనంతరం మాజీ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) కీలక వ్యాఖ్యలు చేశాడు. వచ్చే ఏడాది వన్డే వరల్డ్‌కప్ బృందంలో కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav)ను కచ్చితంగా తీసుకోవాలని బీసీసీఐకి సూచించాడీ స్పిన్ దిగ్గజం.
ఉపఖండంలోనే కాదు విదేశాల్లోనూ జట్టు విజయాల్లో స్పిన్నర్లు కీలక పాత్ర పోషిస్తుంటారు. రాబోయే వన్డే ప్రపంచకప్ పోటీలకు ఆతిథ్యమిస్తున్న దక్షిణాఫ్రికా, నమీబియా, జింబాబ్వేలోనూ వికెట్ స్పిన్‌కు అనుకూలించే అవకాశముంది. అందుకని వచ్చే ప్రపంచకప్ భారత స్క్వాడ్‌లో కుల్దీప్ యాదవ్ ఉండాల్సిందేనని మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. తొలి వన్డేలో కుల్దీప్ ప్రదర్శనను ప్రశంసించిన అశ్విన్ అతడొక ఛాంపియన్ బౌలర్ అని అన్నాడు.
Ravichandran Ashwin backs Kuldeep Yadav for India’s 2027 Cricket World Cup squad. 🔥🇮🇳🫡#Cricket #Ashwin #Kuldeep pic.twitter.com/4KKDmC4UQX
— Sportskeeda (@Sportskeeda) September 29, 2026
‘తిరువనంతపురం వన్డేలో కుల్దీప్ నాలుగు వికెట్లు తీశాడనేది మరచిపోండి. చాలామంది అతడు మళ్లీ సత్తా చాటిన మ్యాచ్ అంటున్నారు. కానీ, అదేమీ కాదు. అతడి ఖాతాలో దాదాపు 200 వికెట్లు ఉన్నాయి. అతడొక ఛాంపియన్ స్పిన్నర్. అతడు లేకుండా దక్షిణాఫ్రికా వెళ్లడం పొరపాటే అవుతుంది. కుల్దీప్ మంచి బౌలర్. అతడు అత్యంత ఉత్తమ బౌలర్‌గా ఉంటున్నాడు కూడా. కౌంటీల్లో ఆడిన కుల్దీప్ అక్కడ వికెట్లు తీశాడు. ఆ అనుభవంతో స్వదేశంలో విండీస్ బ్యాటర్లను బోల్తా కొట్టించాడు. కుల్దీప్ను ఎదుర్కోవడం సులువేమీ కాదు. అతడు చూపిస్తున్న రిథమ్ పట్ల చాలా సంతోషంగా ఉంది’ అని అశ్విన్ పేర్కొన్నాడు.
స్వదేశంలో రెచ్చిపోయిన భారత జట్టు తొలి వన్డేలో వెస్టిండీస్‌ను చిత్తు చేసి ఆధిక్యంలోకి వెళ్లింది. తిరువనంతపురంలో విండీస్‌పై భారీ విజయంలో విరాట్ కోహ్లీ సెంచరీతో పాటు కుల్దీప్ యాదవ్ బౌలింగ్ ప్రదర్శన చెప్పుకోదగ్గదే. మూడొందల దిశగా దూసుకెళ్తున్న ఆ జట్టును వరస వికెట్లతో అద్భుతంగా కట్టడి చేశాడీ చైనామన్ బౌలర్.

అందుకని శతకవీరుడు కోహ్లీని కాదని అతడికే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. తాను మ్యాచ్ విన్నర్ అని కుల్దీప్ పలుమార్లు నిరూపించుకున్నప్పటికీ.. ఇంగ్లండ్ పర్యటనలో అతడిని పక్కన పెట్టేశారు. ఆపై అఫ్గనిస్థాన్‌తో ఒక టీ20లోనే ఆడించారు. కౌంటీల్లో రాణించిన అతడు వెస్టిండీస్‌పై అవకాశం రాగానే నాలుగు వికెట్ల(4-40)తో తన సత్తా చాటాడు. ఇరుజట్ల మధ్య రెండో వన్డే సెప్టెంబర్ 30, బుధవారం గువాహటిలో జరుగనుంది.
Crucial breakthroughs served with a touch of magic ✨
🎥 Watch how Kuldeep Yadav shifted the momentum for #TeamIndia 💙
Updates ▶️ https://t.co/O2cs86p4gq#INDvWI | @mflone_ | @imkuldeep18 pic.twitter.com/nAt1GOrcW2
— BCCI (@BCCI) September 27, 2026