భోపాల్: ఒక వ్యక్తి కారులో పెట్రోల్ నింపుకున్నాడు. డబ్బు చెల్లించకుండా కారులో వెళ్లేందుకు ప్రయత్నించాడు. అడ్డుకోబోయిన బంకు సిబ్బంది చేయి పట్టుకుని కొంతదూరం ఈడ్చుకెళ్లాడు. తీవ్రంగా గాయపడిన అతడు మరణించాడు. (Petrol Pump Worker Killed) మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఈ సంఘటన జరిగింది. బుధవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో సాన్వర్ ప్రాంతంలోని పెట్రోల్ బంకు వద్దకు ఒక కారు వచ్చింది. అందులో కొంత మంది వ్యక్తులు ఉన్నారు.
కాగా, డ్రైవింగ్ సీటులోని వ్యక్తి రూ.4,000 విలువైన పెట్రోల్‌ను ఆ కారులో నింపుకున్నాడు. ఆ తర్వాత డబ్బు చెల్లించకుండా కారు డ్రైవ్ చేశాడు. బంకులో పని చేసే 22 ఏళ్ల రోహిత్ పర్మార్ కారును అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. కారు విండో నుంచి చేయి లోపలకు పెట్టి డబ్బులు అడిగాడు.
మరోవైపు డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి రోహిత్ చేతిని గట్టిగా పట్టుకున్నాడు. కారు విండో మిర్రర్ మూసి డ్రైవ్ చేశాడు. రోహిత్‌ను రోడ్డుపై ఈడ్చుకెళ్లాడు. దీంతో తీవ్రంగా గాయపడిన అతడు మరణించాడు. ఈ నేపథ్యంలో స్థానికులు నిరసన తెలిపారు.
ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఉజ్జయిని వైపు ప్రయాణించిన ఆ కారును గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ మార్గంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. అయితే రిజిస్ట్రేషన్ నంబర్ స్పష్టంగా కనిపించడంతో ఆ కారును గుర్తించేందుకు పోలీసులకు కష్టంగా మారింది.
Also Read: