న్యూఢిల్లీ : కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత మొదటిసారి ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం పార్లమెంట్‌కు వచ్చారు. ఆయన కారు దిగగానే కొందరు ఒడిశా ఎంపీలు సంప్రదాయ టోపీ, శాలువాలతో సన్మానం చేశారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ మాజీమంత్రి ధర్మేంద్రతో మాట్లాడుతూ.. ‘ఇలా జరుగుతూ ఉంటుంది’ అని చెప్పారు.
ధర్మేంద్ర బదులిస్తూ.. ‘ఏమీ జరగలేదు.. నేను స్ట్రీట్ ఫైటర్‌ను. ఏసీ గదుల్లో కూర్చునే కార్యకర్తను కాదు’ అని తెలిపారు. ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యలపై నెటిజన్లు, విపక్షాలు విమర్శలు వ్యక్తం చేశారు.