DGP CV Anand | ఐక్యత చాటిన తెలంగాణ.. రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా గణేష్ నిమజ్జనాలు..!
హైదరాబాద్, సెప్టెంబరు 25: రాష్ట్రవ్యాప్తంగా గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా సాగుతున్నాయని డీజీపీ సి.వి. ఆనంద్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం డిజిపి కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలంగాణ ప్రజానీకం ఐక్యత చాటిందని ఆయన పేర్కొన్నారు.
హైదరాబాద్, సెప్టెంబరు 25: రాష్ట్రవ్యాప్తంగా గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా సాగుతున్నాయని డీజీపీ సి.వి. ఆనంద్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం డిజిపి కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలంగాణ ప్రజానీకం ఐక్యత చాటిందని ఆయన పేర్కొన్నారు. అనంతరం నిమజ్జన ఏర్పాట్లు, పోలీసు బందోబస్తు, ఇప్పటివరకు జరిగిన నిమజ్జనాల వివరాలను ఆయన వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా గణేష్ పోర్టల్‌లో 1.24 లక్షల విగ్రహాలు నమోదయ్యాయని, గతేడాది 1.15 లక్షల ఉండగా.. ఈసారి సంఖ్య పెరిగిందని డీజీపీ తెలిపారు.
గణేశ్ నిమజ్జనోత్సవాలపై డీజీవీ సీవీ ఆనంద్ కీలక విషయాలు పంచుకున్నారు. ప్రజా ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహాల వివరాలను పోర్టల్‌లో నమోదు చేసినట్లు డీజీపీ తెలిపారు. అపార్ట్మెంట్లు, ఇళ్లు, వ్యక్తిగత ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన విగ్రహాలను కలిపితే రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3.5 నుంచి 4 లక్షల వరకు ఉండే అవకాశం ఉందని ఆయన అన్నారు. శుక్రవారం ఉదయం వరకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 88 వేల విగ్రహాల నిమజ్జనం పూర్తయిందని డీజీపీ తెలిపారు. శనివారం ఉదయానికి మిగతా విగ్రహాలు గంగమ్మ ఒడికి చేరే అవకాశం ఉందని ఆయన చెప్పారు.
మతపరమైన అంశాలను గౌరవిస్తూ..
శుక్రవారం కావడంతో మతపరమైన అంశాలను గౌరవిస్తూ నగరంలో శోభాయాత్రలు మధ్యాహ్నం కొంత ఆలస్యంగా ప్రారంభమయ్యాయని డీజీపీ వివరించారు. దీంతో నిమజ్జనాలు కొంత ఆలస్యంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ సంఖ్యలో విగ్రహాలు నిమజ్జనానికి తరలివస్తున్నందున సమయం పడుతోందని డీజీపీ వెల్లడించారు. హైదరాబాద్‌లో నిమజ్జనాల కోసం గత పది రోజులుగా సుమారు 25 వేల మంది పైగా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
#Minister #Ponnam Prabhakar aerially monitors #Ganesh #idols #immersion processions He is accompanied by #DGP CV #Anand, #Police #Commissioner #VC #Sajjanar, #GHMC #Commissioner R V. #Karnan and Collector #Priyanka Ala pic.twitter.com/EpihriMDRR
— shinenewshyd (@shinenewshyd) September 25, 2026
హైదరాబాద్ ఇన్‌ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ సీపీ, జీహెచ్ఎంసీ కమిషనర్, కలెక్టర్ తదితరులతో ఏరియల్ సర్వే ద్వారా కూడా పరిస్థితిని పరిశీలించినట్లు డీజీపీ తెలిపారు. రాజేంద్రనగర్, శంషాబాద్ ప్రాంతాల పరిధి విస్తరించడంతో నిమజ్జన విగ్రహాల తరలింపునకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని అన్నారు. ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తూ నిమజ్జన ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించినట్లు డీజీపీ చెప్పారు.
అదనపు బలగాలు
వినాయక నిమజ్జనాలను పునస్కరించుకొని శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా టీజీఎస్పీ, ఆర్ఏఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, ఆక్టోపస్ బలగాలను మోహరించినట్లు డీజీపీ తెలిపారు. డీజీపి రిజర్వ్ నుంచి ఐదు కంపెనీలను కూడా అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. ప్రధాన నిమజ్జన ప్రాంతాల్లో భారీగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి, కమాండ్ కంట్రోల్ కేంద్రాల ద్వారా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు. క్రేన్లు, ఇతర అత్యవసర సేవలను కూడా అందుబాటులో ఉంచినట్లు ఆయన తెలిపారు.
Visited Khairatabad Bada Ganesh today and sought the blessings of Lord Ganesha for the peace and prosperity of the people of Telangana. Throughout my career, beginning with my tenure as DCP, Central Zone, I have had a 13-year association with the Khairatabad Ganesh celebrations,… pic.twitter.com/4zI9AoHp2b
— CV Anand IPS (@CVAnandIPS) September 23, 2026
13 మంది మృతి.. 26 మందికి గాయాలు
గణేష్ ఉత్సవాల సందర్భంగా గత పది రోజుల్లో 13 మంది మృతి చెందడం బాధాకరమని డీజీపీ ఆవేదన వ్యక్తం చేశారు. నిమజ్జన విధులకు హైదరాబాద్ వచ్చిన కొత్తగూడెం ఎస్సై వెంకన్న మృతి బాధాకరమని ఆనంద్ అన్నారు. సైబరాబాద్ పరిధిలోని పటాన్చెరులో ఆరుగురు మృతి చెందడం దురదృష్టకరమని డీజీపీ పేర్కొన్నారు. ఖైరతాబాద్‌లో శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఒకరు మృతి చెందగా, నిర్మల్‌లో గుండెపోటుతో ఒకరు మృతి చెందినట్లు తెలిపారు. డీజే శబ్దాల కారణంగా కూడా కొందరు మృతి చెందినట్లు డీజీపీ పేర్కొన్నారు. మొత్తం 26 మంది ప్రమాదాల్లో గాయపడగా, మల్కాజిగిరిలో 17 మంది గాయపడినట్లు డీజీపీ తెలిపారు. ప్రజలు శబ్ద కాలుష్యాన్ని తగ్గించి, నిబంధనలు పాటించాలని సూచించారు.
శనివారం ఉదయానికల్లా
హైదరాబాద్‌లో మిగిలిన విగ్రహాల నిమజ్జన ప్రక్రియను ఆలస్యం చేయకుండా పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ తెలిపారు. శనివారం ఉదయం 10.30 గంటలలోపు నిమజ్జన ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌తోపాటు అన్ని జిల్లాల్లోనూ నిమజ్జనాలు దాదాపు పూర్తయ్యాయని, నల్గొండ, నిర్మల్ తదితర ప్రాంతాల్లో కొంత సమయం పట్టే అవకాశం ఉందని అన్నారు. గణేష్ ఉత్సవాల నిర్వహణను పోలీసులు ఆరు దశలుగా విభజించుకున్నారని డీజీపీ తెలిపారు. అందులో చివరి దశగా ప్రతి ఒక్కరూ నిమజ్జనం పూర్తిచేసుకుని సురక్షితంగా ఇంటికి చేరేవరకు పోలీసుల విధులు కొనసాగుతాయని స్పష్టం చేశారు. తెలంగాణ సమైక్యతకు, సోదరభావానికి నిదర్శనం.

తెలంగాణ అంటే అన్ని మతాల ప్రజలు సమైక్యంగా, సోదరభావంతో జీవించే ప్రాంతమని డీజీపీ అన్నారు. గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా జరగడం ప్రజల ఐక్యతకు నిదర్శనమన్నారు. భైంసాలో ముస్లిం సోదరులు ‘హిందూ–ముస్లిం భాయ్భాయ్’ అంటూ గణేష్ ఉత్సవాల్లో పాల్గొనడం దీనికి నిదర్శనంగా అభివర్ణించారు. నిమజ్జనానికి వచ్చే విగ్రహాలను ఆలస్యం చేయకుండా, పోలీసుల సూచనలకు అనుగుణంగా త్వరగా తరలించాలని డీజీపీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించడంతోపాటు ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఇంటికి చేరేలా పోలీసులకు సహకరించాలని కోరారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్‌కు దీప్కే కౌంటర్
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

