CBSE : సీనియర్ ఐఏఎస్ అధికారి మందీప్ కే బండారి (Mandeep K Bhandari) సీబీఎస్ఈ నూతన చైర్మన్‌గా నియమితులయ్యారు. ఇటీవల ప్లస్ టూ పరీక్షల ఆన్ స్క్రీన్ మార్కుల్లో అవకతవకలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న సీబీఎస్ఈని ఇకపై ఆయన నడింపించనున్నారు. తదుపరి చైర్మన్‌గా ఆయన నియామకానికి క్యాబినెట్ కమిటీ శుక్రవారం ఆమోదం తెలిపింది. సీబీఎస్ఈ చైర్మన్ పదవి తాత్కాలికంగా అడిషనల్ సెక్రటరీ స్థాయికి మారినందున ఆయన జీతభత్యాలు కూడా అదే ర్యాంకులో ఉండనున్నాయి. ఎంబీబీఎస్‌లో గోల్డ్ మెడలిస్ట్ అయిన మందీప్ 2001 బ్యాచ్ అగ్మట్ కేడర్ ఐఏఎస్.
సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్‌కు కొత్త చైర్మన్ వచ్చేశారు. పరీక్షల్లో సంస్కరణల పరంగా ఇటీవల సవాళ్లు ఎదుర్కొన్న ఈ బోర్డు నూతన చైర్మన్‌గా ఐఏఎస్ అధికారి మందీప్ కే బండారి నియమితులయ్యారు. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా పరిపాలనా విభాగంలో సేవంలందించిన ఆయన.. ఇక విద్యా వ్యవస్థ పురోగతిలో భాగం కానున్నారు. మాజీ డాక్టర్ అయిన మందీప్.. 2001 బ్యాచ్ అగ్మట్ కేడర్ ఐఏఎస్.
STORY | Senior bureaucrat Mandeep K Bhandari appointed CBSE chairperson
Senior bureaucrat Mandeep K Bhandari was appointed chairperson of the Central Board of Secondary Education (CBSE) following a bureaucratic reshuffle effected by the Centre on Friday.
READ:… pic.twitter.com/tXwTpPizhw
— Press Trust of India (@PTI_News) September 25, 2026
లూథియానలోని దయానంద వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ చదివిన మందీప్.. ఉత్తమ ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్ సాధించారు. ఆపై సివిల్స్‌కు సన్నద్ధమైన ఆయన.. 2001లో ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. లేహ్, జమ్ము కశ్మీర్లో డిప్యూటీ కమిషనర్‌గా విధులు నిర్వహించారు. జమ్ము కశ్మీర్లో విద్య, వైద్యం విభాగాలను కూడా చూసుకున్నారు మందీప్. అనంతరం కేంద్రంలో కేంద్ర మానవ వనరుల శాఖలో ప్రైవేట్ సెక్రటరీగా ఆయన పని చేశారు. ఆపై వైద్య, కుటుంబ సంక్షేమం శాఖలో జాయింట్ సెక్రటరీ హోదాకు చేరుకున్నారు. ప్రస్తుతం జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌కు ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న మందీప్.. ఇకపై సీబీఎస్ఈ చైర్మన్‌గా వ్యవహరించనున్నారు.