Commonwealth Games | వింద్యారాణి కంచుమోత.. ఆరుకు చేరిన పతకాల సంఖ్య..!
Commonwealth Games : ఇప్పటికే నలుగురు పతకాలు సాధించగా.. 58 కిలోల విభాగంలో వింద్యారాణి దేవి సొరొఖాబామ్ (Bindyarani Devi Sorokhaibam) కంచుమోత మోగించింది.
Commonwealth Games : కామన్వెల్త్ క్రీడల్లో భారత వెయిట్‌లిఫ్టర్లు గర్వపడే ప్రదర్శన చేస్తున్నారు. గ్లాస్గోలో అంచనాలు అందుకుంటూ ఇప్పటికే నలుగురు పతకాలు సాధించగా.. 58 కిలోల విభాగంలో వింద్యారాణి దేవి సొరొఖాబామ్ (Bindyarani Devi Sorokhaibam) కంచుమోత మోగించింది. హోరాహోరీగా సాగిన పోటీల్లో సత్తా చాటిన వింద్యారాణి 199 కిలోలు ఎత్తి దేశానికి కాంస్యం అందించింది. నాలుగేళ్ల క్రితం బర్మింగ్హమ్లో వెండి వెలుగులు విరజిమ్మిన మణిపూర్ తేజం ఈసారి మూడో స్థానంతో సరిపెట్టుకుంది.
గ్లాస్గో ఆతిథ్యమిస్తున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత వెయిట్‌లిఫ్టర్లు పోడియంపై మెరుస్తున్నారు. ఐదో రోజైన సోమవారం జ్ఞానేశ్వరి దేవి 53 కిలోల విభాగంలో వెండి పతకం సాధించగా.. 58 కిలోల విభాగంలో వింద్యారాణి దేవి సొరొఖాబామ్ కాంస్యం కొల్లగొట్టింది.
స్నాచ్‌లో 87 కిలోలు, ఆపై క్లీన్ అండ్ జెర్క్‌లో 112 కిలోలు ఎత్తిన వింద్యారాణి మూడో స్థానంలో నిలిచింది. తద్వారా వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్‌కు ఐదో పతకం అందించిందీ మణిపూర్ మహిళ. 2022 ఎడిషన్‌లో సిల్వర్ మెడల్.. ఐడబ్ల్యూఎఫ్ వరల్డ్‌కప్‌లోనూ పతకం గెలిచిన వింద్యా ఈసారి కాంస్యంతో మువ్వన్నెల జెండాను రెపరెపలాడించింది.
Grit, grip, and glory! 🇮🇳
Many congratulations to Bindyarani Devi on winning a Bronze medal in Women’s 58kg category and securing India’s fifth medal in Weightlifting. Keep making the nation proud. pic.twitter.com/StRXSz9jBC
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) July 27, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Soma Bharat Kumar | హరీశ్ రావుకు ఎటువంటి షోకాజ్ నోటీసు ఇవ్వలేదు : బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్
Kuravi | వీరన్న సన్నిధిలో బీఆర్ఎస్ మహిళా నేతల పూజలు
Harish Rao | పాలమూరు బాధితులకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి : హరీష్‌రావు డిమాండ్
V Hanumantha Rao | నేను మాట్లాడొద్దా.. స్పీచ్ మధ్యలో సీఎం రేవంత్ రెడ్డిని అడ్డుకున్న వీ హన్మంతరావు.. వీడియో
Farmers Protest | వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలని రైతుల మహాధర్నా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

