RBI | భారతీయ రిజర్వ్ బ్యాంకు రూ.3.93 లక్షల కోట్లను వెనక్కి తీసుకుంది.. ఎందుకో తెలుసా..?
RBI | బ్యాంకింగ్ వ్యవస్థ (Banks) లో పేరుకుపోయిన అదనపు ద్రవ్య లభ్యతను నియంత్రించేందుకు ఆర్బీఐ (RBI) మరోసారి రంగంలోకి దిగింది. తాజాగా నిర్వహించిన 'వేరియబుల్ రేట్ రివర్స్ రెపో (VRRR)' వేలం ద్వారా రూ.3,93,352 కోట్లను ఆర్బీఐ వెనక్కి తీసుకుంది. బ్యాంకింగ్ వ్యవస్థలో అదనపు నిధులను తగ్గించి, మనీ మార్కెట్ రేట్లను రెపో రేటుకు అనుగుణంగా ఉంచడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టింది.
RBI : బ్యాంకింగ్ వ్యవస్థ (Banks) లో పేరుకుపోయిన అదనపు ద్రవ్య లభ్యతను నియంత్రించేందుకు ఆర్బీఐ (RBI) మరోసారి రంగంలోకి దిగింది. తాజాగా నిర్వహించిన ‘వేరియబుల్ రేట్ రివర్స్ రెపో (VRRR)’ వేలం ద్వారా రూ.3,93,352 కోట్లను ఆర్బీఐ వెనక్కి తీసుకుంది. బ్యాంకింగ్ వ్యవస్థలో అదనపు నిధులను తగ్గించి, మనీ మార్కెట్ రేట్లను రెపో రేటుకు అనుగుణంగా ఉంచడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టింది.
ఈ వేలం కోసం ఆర్బీఐ రూ.5 లక్షల కోట్ల నోటిఫైడ్ మొత్తాన్ని ప్రకటించగా.. బ్యాంకుల నుంచి రూ.3,93,352 కోట్ల విలువైన బిడ్లు దాఖలయ్యాయి. వచ్చిన బిడ్లన్నింటినీ ఆర్బీఐ ఆమోదించింది. ఈ నిధులను 5.24 శాతం కటాఫ్, వెయిటెడ్ యావరేజ్ రేటుతో స్వీకరించినట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది. కాగా సెప్టెంబర్ 11 నాటికి బ్యాంకింగ్ వ్యవస్థలో ద్రవ్య లభ్యత సుమారు రూ.10.73 లక్షల కోట్లుగా ఉన్నట్లు అంచనాలు ఉన్నాయి.
బ్యాంకులు ఇటీవల భారీగా ఫారిన్ కరెన్సీ నాన్-రెసిడెంట్ (ఎఫ్సీఎన్ఆర్-బీ) డిపాజిట్లను సమీకరించడమే ఈ అదనపు నగదుకు ప్రధాన కారణంగా తెలుస్తున్నది. ఈ డిపాజిట్ల ద్వారా వచ్చిన విదేశీ కరెన్సీని బ్యాంకులు ఆర్బీఐతో స్వాప్ చేసుకోవడంతో వాటికి పెద్ద మొత్తంలో రూపాయి ద్రవ్యం అందుబాటులోకి వచ్చింది. ఈ అదనపు నిధులను నియంత్రించేందుకు గత నెల నుంచి ఆర్బీఐ వరుసగా వీఆర్ఆర్ఆర్ వేలాలను నిర్వహిస్తున్నది.
వీఆర్ఆర్ఆర్ వేలంతోపాటు మరో కీలకమైన చర్యను కూడా ఆర్బీఐ ప్రకటించింది. అదనపు ద్రవ్యాన్ని మరింత సమర్థంగా నియంత్రించేందుకు ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ కింద రూ.1 లక్ష కోట్ల విలువైన ప్రభుత్వ సెక్యూరిటీలను విక్రయించనుంది. మూడు విడతల్లో ఈ అమ్మకాలు జరగనున్నాయి. మొదటి విడతలో భాగంగా సెప్టెంబర్ 17న రూ.50,000 కోట్ల విలువైన సెక్యూరిటీలను విక్రయిస్తారు.
ఆ తర్వాత సెప్టెంబర్ 21, 28 తేదీల్లో రూ.25,000 కోట్ల చొప్పున రెండు విడతల్లో వేలాలు జరుగుతాయి. ఇదే నెల ఆరంభంలో నిర్వహించిన ఓవర్ నైట్ వీఆర్ఆర్ఆర్ వేలంలో కూడా ఆర్బీఐ రూ.3.53 లక్షల కోట్లకు పైగా నిధులను సమీకరించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

