China missile : ప్రస్తుతం యెమెన్‌లోని హౌతీలకు, సౌదీ అరేబియాకు మధ్య యుద్ధం సాగుతోంది. ఈ అంశంలో సంచలన విషయం వెలుగుచూసింది. చైనాకు చెందిన క్షిపణుల్ని సౌదీ అరేబియా వాడుతోందా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. కారణం.. యెమెన్‌లో లభించిన ఒక మిస్టరీ మిస్సైల్. సౌదీ అరేబియాపై యెమెన్‌కు చెందిన హౌతీ ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారు. ఇరాన్ మద్దతుతో హౌతీలు సౌదీ అరేబియాపై దాడికి పాల్పడుతున్నారు.
దీంతో సౌదీ కూడా హౌతీలపై ఎదురుదాడి చేస్తోంది. యెమెన్‌లోని హౌతీ స్థావారాలపై సౌదీ క్షిపణి దాడులు చేస్తోంది. రెండు రోజుల క్రితం కూడా సౌదీ దాడి చేసింది. ఈ సందర్భంగా ఒక దాడికి సంబంధించి క్షిపణి శకలాల్ని సోమవారం యెమెన్ అధికారులు గుర్తించారు. ఆ క్షిపణిని పరిశీలించగా అది చైనాకు చెందిందని తేలింది. అది చైనా తయారు చేసే డీఎఫ్-15ఏ క్షిపణి. ఇది తక్కువ రేంజ్ కలిగిన చైనా తయారీ క్షిపణి. అయితే, చైనా క్షిపణి యెమెన్‌కు ఎలా వచ్చింది అనేదే ప్రశ్న. చైనా నుంచి క్షిపణుల్ని సౌదీ అరేబియా కొంటుందా అనే సందేహాలు మొదలయ్యాయి.
Suudi Arabistan, Yemen’deki Ensarullah’a yönelik saldırılarda Çin yapımı füzeler kullandı.
📌Yemen’in Marib kentinde Çin yapımı bir DF-15A füze itici motoru bulundu. pic.twitter.com/VZX2AqV5R1
— War Tech Global (@WarTechGlobal) September 14, 2026
చైనా నుంచి అధికారికంగా సౌదీ అరేబియా ఎప్పుడు క్షిపణుల్ని కొనలేదు. పైగా సౌదీ.. అమెరికాతో సైనిక ఒప్పందం కలిగి ఉంది. అలాంటిది ఇప్పుడు చైనా తయారీ క్షిపణిని సౌదీ అరేబియా ఎలా ప్రయోగించగలిగిందనే చర్చ జరుగుతోంది. ప్రపంచానికి తెలియకుండా సౌదీ అరేబియా.. ఏవైనా క్షిపణుల్ని కలిగి ఉందా అనే విషయం తేలాలి. అయితే, ఈ విషయంపై ఇటు యెమెన్, అటు సౌదీ అరేబియా, చైనా కూడా స్పందించలేదు.