ముంబై: అమెరికా, ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య యుద్ధం నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అయితే ఇరాన్ ఆధీనంలోని హార్మూజ్ జలసంధిని ఒక ఆయిల్ ట్యాంకర్ సురక్షితంగా దాటింది. క్షిపణులు, డ్రోన్ దాడుల నుంచి తప్పించుకుని భారత్ చేరుకున్నది. (First oil tanker reaches Mumbai) లైబీరియా జెండా కలిగిన చమురు ట్యాంకర్ షెన్లాంగ్ సూయెజ్‌మాక్స్ బుధవారం ఉదయం ముంబై పోర్ట్‌కు చేరుకున్నది. మార్చి 1న సౌదీ అరేబియాలోని రాస్ తనురా ఫిప్యార్డ్ నుంచి ఇది బయలు దేరింది. 1,35,335 మెట్రిక్ టన్నుల క్రూడ్ ఆయిల్‌ను భారత్‌కు దిగుమతి చేసింది.
కాగా, ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో కీలకమైన హార్మూజ్ జలసంధిపై ఇరాన్ ఆంక్షలు విధించింది. తమ అనుమతి లేకుండా ఈ మార్గంగుండా వెళ్లే నౌకలపై దాడులు చేస్తామని హెచ్చరించింది. దీంతో హార్మూజ్ జలసంధికి ఇరువైపులా అనేక ఆయిల్ ట్యాంకర్లు, కార్గో షిప్‌లు నిలిచిపోయాయి.
మరోవైపు అమెరికాతో సహా పలు దేశాలకు చెందిన కొన్ని ఆయిల్ ట్యాంకర్లపై ఇరాన్ క్షిపణులతో దాడులు చేసింది. ఇలాంటి యుద్ధ పరిస్థితుల్లో లైబీరియా ఆయిల్ ట్యాంకర్ చాకచక్యంగా హార్మూజ్ జలసంధిని దాటింది. ముంబై పోర్ట్‌లోని జవహర్ ద్వీప్ టెర్మినల్‌కు బుధవారం ఉదయం సురక్షితంగా చేరుకున్నది. దేశంలో చమురు సంక్షోభం నెలకొన్న తరుణంలో తొలి ఆయిల్ ట్యాంకర్ భారత్ చేరడం ఊరట నిచ్చింది.
#WATCH | Liberia-flagged tanker ship ‘Shenlong’ enters Indian waters near Mumbai Port. It was captained by an Indian and was loaded with crude oil from the Saudi port Ras Tanura.
Latest visuals from Mumbai Port pic.twitter.com/4BWABAsZ88
— ANI (@ANI) March 12, 2026
Also Read:
Don’t panic on LPG | ఎల్పీజీ కొరతపై భయాందోళన వద్దు.. అనవసరంగా బుకింగ్ చేయవద్దు: కేంద్రం
Induction cooktops | దేశంలో ఎల్పీజీ సంక్షోభం.. ఇండక్షన్ కుక్‌టాప్‌లకు పెరిగిన డిమాండ్