Venki Atluri | తెలుగు డైరెక్టర్ కానీ వరుసగా తమిళ్, మలయాళ హీరోలతోనే సినిమాలు.. వెంకీ అట్లూరి స్ట్రాటజీ ఇదేనా?
Venki Atluri | టాలీవుడ్లో ప్రశాంతంగా తన పని తాను చేసుకుంటూ వరుస విజయాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుల్లో వెంకీ అట్లూరి ఒకరు. పెద్దగా హడావుడి లేకుండా కంటెంట్‌కు ప్రాధాన్యం ఇస్తూ సినిమాలు తెరకెక్కించే ఆయన, ఇప్పుడు తెలుగు పరిశ్రమకే పరిమితం కాకుండా దక్షిణాది సినీ ఇండస్ట్రీల్లోనూ మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇటీవల ఆయన వరుసగా తెలుగు హీరోలతో కాకుండా తమిళ్, మలయాళ స్టార్ హీరోలతోనే సినిమాలు చేస్తున్నారు.
Venki Atluri | టాలీవుడ్లో ప్రశాంతంగా తన పని తాను చేసుకుంటూ వరుస విజయాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుల్లో వెంకీ అట్లూరి ఒకరు. పెద్దగా హడావుడి లేకుండా కంటెంట్‌కు ప్రాధాన్యం ఇస్తూ సినిమాలు తెరకెక్కించే ఆయన, ఇప్పుడు తెలుగు పరిశ్రమకే పరిమితం కాకుండా దక్షిణాది సినీ ఇండస్ట్రీల్లోనూ మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇటీవల ఆయన వరుసగా తెలుగు హీరోలతో కాకుండా తమిళ్, మలయాళ స్టార్ హీరోలతోనే సినిమాలు చేస్తున్నారు. వెంకీ అట్లూరి తన సినీ ప్రయాణాన్ని వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కించిన తొలిప్రేమ సినిమాతో ప్రారంభించారు. ఆ చిత్రం ఘన విజయం సాధించడంతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. అనంతరం మిస్టర్ మజ్ను, రంగ్ దే వంటి చిత్రాలు తెరకెక్కించినప్పటికీ అవి ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోలేకపోయాయి.
ఆ తర్వాత వెంకీ అట్లూరి తన దృష్టిని ద్విభాషా చిత్రాలపై కేంద్రీకరించారు. తమిళ స్టార్ ధనుష్ హీరోగా తెరకెక్కించిన ‘సర్’ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా వెంకీ కెరీర్లో కీలక మలుపుగా నిలిచింది. అదే విజయాన్ని కొనసాగిస్తూ మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్‌తో తెరకెక్కించిన ‘లక్కీ భాస్కర్’ కూడా ఘన విజయాన్ని సాధించింది. ప్రేక్షకుల ప్రశంసలతో పాటు ఈ చిత్రానికి జాతీయ స్థాయిలో గుర్తింపు కూడా లభించింది. దీంతో వెంకీ అట్లూరి పేరు సౌత్ ఇండస్ట్రీ మొత్తం మార్మోగింది. ప్రస్తుతం వెంకీ అట్లూరి తమిళ స్టార్ హీరో సూర్యతో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. వరుస విజయాలతో ఉన్న వెంకీ, సూర్య కాంబినేషన్‌పై సినీ అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.
తెలుగు హీరోతో తదుపరి సినిమా చేస్తారని అభిమానులు భావిస్తుండగా, వెంకీ అట్లూరి మరోసారి బయటి హీరోలతోనే ప్రాజెక్టులను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. లక్కీ భాస్కర్ కు సీక్వెల్ రూపొందించే ఆలోచనలో ఉన్నట్లు ఆయన వెల్లడించారు. అలాగే ధనుష్‌కి మరో కథ వినిపించగా, అది ఆయనకు నచ్చిందని, ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్‌పై చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు.ఇటీవల ధనుష్ కూడా వెంకీ అట్లూరితో మరో సినిమా చేయనున్నట్లు సంకేతాలు ఇచ్చారు. మరో తమిళ స్టార్ హీరోతో కూడా వెంకీ అట్లూరి సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. వెంకీ అట్లూరి సినిమాల ప్రత్యేకత కంటెంట్‌కే ప్రాధాన్యం ఇవ్వడం. అందుకే ఆయనతో ఒకసారి పని చేసిన హీరోలు మళ్లీ ఆయన దర్శకత్వంలో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. తెలుగు, తమిళ్ మార్కెట్లను ఒకేసారి ఆకట్టుకునే కథలను ఎంపిక చేసుకోవడం కూడా ఆయన విజయానికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

