Musi Beautification | బిగ్ బ్రేకింగ్.. మూసీ ఫక్తు రియల్ ఎస్టేట్ ప్రాజెక్టే.. ఫేజ్ 1లో 3 వేల ఎకరాల భూసేకరణ..!
Musi Beautification : మూసీ సుందరీకరణపై ప్రజల్లో నెలకొన్న భయాందోళనలు నిజమేనని నిరూపితమైంది. మూసీ బ్యూటిఫికేషన్ అనేది ఫక్తు రియల్ ఎస్టేట్ ప్రాజెక్టేనని ప్రభుత్వ ప్రజెంటేషన్‌తో తేలిపోయింది.
Musi Beautification : మూసీ సుందరీకరణపై ప్రజల్లో నెలకొన్న భయాందోళనలు నిజమేనని నిరూపితమైంది. మూసీ బ్యూటిఫికేషన్ అనేది ఫక్తు రియల్ ఎస్టేట్ ప్రాజెక్టేనని ప్రభుత్వ ప్రజెంటేషన్‌తో తేలిపోయింది. మూసీ ఒడ్డున నిర్మించ తలపెట్టిన గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ ఫేజ్ 1 గురించి వివరిస్తూ.. 3 వేల ఎకరాల పైనే సేకరిస్తున్నామని చెప్పారు. తద్వారా సామాన్యులకు సంబంధించిన వేల ఎకరాల భూమిని సేకరించి అమ్ముకోవడం, దరిదాపుల్లోని ఇండ్లు కూలగొట్టి రియల్ ఎస్టేట్ కంపెనీలకు కట్టబెట్టడం… ఇవే మూసీ ప్రాజెక్ట్ సుందరీకరణ అనే విషయం మాత్రం స్పష్టం అయింది.
ఇన్నాళ్లూ మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్, ఇతరట్టడాలు కూలగొట్టి అక్కడ ఏం చేస్తారో అనే విషయంలో కొంత అస్పష్టత ఉండేది. కానీ, ఇవ్వాళ మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్‌లో అక్కడ ఏం రానుందో ఐఏఎస్ అధికారి వెంకట్ నర్సింహా రెడ్డి చాలా స్పష్టంగా వివరించారు. మొదటి నుండి భయపడ్డట్టే మధు పార్క్ రిడ్జ్ వంటి అపార్ట్మెంట్లు, సమీపంలోని ఇండ్లు కూల్చి అక్కడ ఒక పెద్ద జెయింట్ వీల్, ఆ పక్కనే అనేక కమర్షియల్ భవంతులు కట్టనున్నారు.
ఇవ్వాళ్టి ప్రజెంటేషన్‌లో మూసీ ప్రాంతాన్ని ఎలా “అభివృద్ధి” చేయాలనుకుంటున్నారో ఒక ఊహా చిత్రం చూపించారు. అందులో చాలా స్పష్టంగా జెయింట్ వీల్, కమర్షియల్ భవంతులు సరిగ్గా మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ ఉన్న స్థలంలోనే రాబోతున్నాయి. దీంతో ఈ మూసీ సుందరీకరణ ప్రాజెక్టు అనేది ఒక ఫక్తు రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ అని స్పష్టమైపోయింది.
బిగ్ బ్రేకింగ్!
మొదట్నుండి చెప్పిందే నిజమైంది!
మూసీ ఫక్తు రియల్ ఎస్టేట్ ప్రాజెక్టే!
ఫేజ్ 1 గురించి చెప్తూ 3 వేల ఎకరాలు పైనే సేకరిస్తున్నామని చెప్పారు
సామాన్యులకు సంబంధించిన వేల ఎకరాలు సేకరించి అమ్ముకోవడం, ఇండ్లు కూలగొట్టి రియల్ ఎస్టేట్ కంపెనీలకు అమ్మడం ఇదే మూసీ ప్రాజెక్ట్… pic.twitter.com/JnzMQLxVWm
— Telugu Scribe (@TeluguScribe) March 13, 2026
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

