Sreeleela | వరుస ప్లాపుల తర్వాత శ్రీలీలకు బంపర్ ఆఫర్.. ఆ స్టార్ హీరో సరసన ఛాన్స్ దక్కిందా?
Sreeleela | టాలీవుడ్లో ఒకప్పుడు వరుస అవకాశాలతో స్టార్ హీరోయిన్గా దూసుకెళ్లిన శ్రీలీల ఇప్పుడు కెరీర్లో కీలక దశను ఎదుర్కొంటోంది. 'పెళ్లి సందD'తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ అందాల భామ, 'ధమాకా' బ్లాక్‌బస్టర్ విజయంతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ల జాబితాలో చేరింది. తన డ్యాన్స్, ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ, ఆ తర్వాత నటించిన పలు చిత్రాలు ఆశించిన విజయాలు సాధించకపోవడంతో కెరీర్ కాస్త నెమ్మదించింది.
Sreeleela | టాలీవుడ్లో ఒకప్పుడు వరుస అవకాశాలతో స్టార్ హీరోయిన్గా దూసుకెళ్లిన శ్రీలీల ఇప్పుడు కెరీర్లో కీలక దశను ఎదుర్కొంటోంది. ‘పెళ్లి సందD’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ అందాల భామ, ‘ధమాకా’ బ్లాక్‌బస్టర్ విజయంతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ల జాబితాలో చేరింది. తన డ్యాన్స్, ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ, ఆ తర్వాత నటించిన పలు చిత్రాలు ఆశించిన విజయాలు సాధించకపోవడంతో కెరీర్ కాస్త నెమ్మదించింది. వరుస పరాజయాల ప్రభావంతో తెలుగులో అవకాశాలు తగ్గిన నేపథ్యంలో, శ్రీలీల ఇప్పుడు ఇతర భాషలపై దృష్టి పెట్టింది. ఇప్పటికే బాలీవుడ్లో కార్తీక్ ఆర్యన్ సరసన ఓ భారీ చిత్రంలో నటించే అవకాశం దక్కించుకున్న ఈ భామకు తాజాగా కోలీవుడ్ నుంచి మరో ప్రతిష్టాత్మక ఆఫర్ వచ్చినట్లు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.
తమిళ సినీ వర్గాల సమాచారం ప్రకారం, సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించనున్న ఓ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో శ్రీలీలను కథానాయికగా ఎంపిక చేసే దిశగా చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రజనీకాంత్ వరుస భారీ చిత్రాలతో బిజీగా ఉండగా, ఆయన లైనప్‌లో ఉన్న ప్రాజెక్ట్‌లలో ఒకదానిలో శ్రీలీల నటించే అవకాశాలు ఉన్నాయని కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ ఖరారైతే, శ్రీలీల కెరీర్లో ఇది అత్యంత కీలకమైన అవకాశంగా నిలవనుంది. వరుస ప్లాపుల తర్వాత కూడా రజనీకాంత్ వంటి లెజెండరీ స్టార్ సరసన నటించే అవకాశం రావడం ఆమెకు మరోసారి కెరీర్‌ను గాడిలో పెట్టే ఛాన్స్‌గా భావిస్తున్నారు. ఈ సినిమా విజయం సాధిస్తే, దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లోనూ శ్రీలీల క్రేజ్ మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇక ప్రస్తుతం శ్రీలీల వ్యక్తిగతంగా కూడా బిజీగానే ఉంది. తన తల్లితో కలిసి పలు ప్రముఖ దేవాలయాలను సందర్శిస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటోంది. సినిమాలతో పాటు ప్రముఖ బ్రాండ్లకు సంబంధించిన వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ, తన స్కిన్‌కేర్ వ్యాపారాన్ని కూడా విజయవంతంగా నిర్వహిస్తోంది.సినిమాల విషయానికి వస్తే, తమిళంలో ఇప్పటికే ‘పరాశక్తి’తో పాటు ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న మరో చిత్రంలో కూడా శ్రీలీల నటిస్తోంది. ఈ సినిమాలపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు రజనీకాంత్ ప్రాజెక్ట్ వార్తలు నిజమైతే, శ్రీలీల కెరీర్‌కు ఇది భారీ టర్నింగ్ పాయింట్‌గా మారే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, రజనీకాంత్ సినిమా విషయమై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో అభిమానులు అధికారిక ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parliament: డీలిమిటేషన్, వుమెన్స్ కోటా బిల్లులు.. ఈనెలలోనే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు
Calling Name Presentation: ఫోన్ స్క్రీన్‌పై ఇక పేరు కూడా డిస్ప్లే అవుతుంది.. నవంబర్ ఒకటి నుంచి తప్పనిసరి
Tuni Chairperson | తునిలో జనసైనికులకు షాక్.. చైర్పర్సన్ అభ్యర్థిగా టీడీపీ నుంచి వచ్చిన నేత!
Bhatti vs Revanth | భట్టి వర్సెస్ రేవంత్.. ముదురుతున్న వివాదం.. విద్యుత్ అధికారులపై సీఎం వ్యాఖ్యలతో కలకలం
Manne Krishank | ఒకటి కాదు మూడు ఆధారాలు చూపిస్తా.. మెడికవర్ ఆసుపత్రి షేర్లపై రేవంత్‌రెడ్డికి క్రిశాంక్ సవాల్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

