Varun Tej | ‘కొరియన్ కనకరాజు’కు అదిరే ఓపెనింగ్.. బుక్‌మైషోలో ఏకంగా 33 వేల టికెట్లు సేల్
Varun Tej | మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా నటించిన తాజా హారర్ కామెడీ ఎంటర్టైనర్ 'కొరియన్ కనకరాజు' విడుదలకు ముందే మంచి హైప్‌ను సొంతం చేసుకుంది. వినూత్నమైన కాన్సెప్ట్, ఆకట్టుకునే ట్రైలర్, ప్రమోషన్స్‌తో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొల్పిన ఈ చిత్రం ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద బలమైన ఆరంభాన్ని నమోదు చేసినట్లు తెలుస్తోంది.
Varun Tej | మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా నటించిన తాజా హారర్ కామెడీ ఎంటర్టైనర్ ‘కొరియన్ కనకరాజు’ విడుదలకు ముందే మంచి హైప్‌ను సొంతం చేసుకుంది. వినూత్నమైన కాన్సెప్ట్, ఆకట్టుకునే ట్రైలర్, ప్రమోషన్స్‌తో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొల్పిన ఈ చిత్రం ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద బలమైన ఆరంభాన్ని నమోదు చేసినట్లు తెలుస్తోంది. సినిమా విడుదలకు ముందు నుంచే అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగగా, చివరి 24 గంటల్లో బుకింగ్స్ మరింత ఊపందుకున్నాయి. ప్రముఖ టికెటింగ్ ప్లాట్‌ఫామ్ బుక్‌మైషోలో ఒక్కటే 33 వేలకుపైగా టికెట్లు అమ్ముడవ్వడం సినిమాపై ఉన్న ఆసక్తికి నిదర్శనంగా మారింది. ఈ స్థాయి బుకింగ్స్‌తో చిత్రబృందంలోనూ, అభిమానుల్లోనూ ఉత్సాహం నెలకొంది.
ఇక విడుదలకు ముందు నిర్వహించిన పెయిడ్ ప్రీమియర్ షోలు సినిమాకు మరింత బూస్ట్ ఇచ్చాయి. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో ప్రీమియర్ షోలు దాదాపు హౌస్‌ఫుల్‌గా ప్రదర్శించబడ్డాయి. సినిమా చూసిన ప్రేక్షకుల నుంచి ప్రారంభ స్పందన సానుకూలంగా రావడంతో సోషల్ మీడియాలో కూడా ఈ చిత్రంపై చర్చ మొదలైంది. ముఖ్యంగా వరుణ్ తేజ్ కామెడీ టైమింగ్, ఆయన నటన, హారర్‌తో కూడిన వినోదాత్మక సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయని సినిమా చూసిన వాళ్లు చెబుతున్నారు. కొన్ని కామెడీ ఎపిసోడ్లు థియేటర్లలో మంచి నవ్వులు పూయిస్తున్నాయని సినీ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
అంతేకాకుండా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాల నుంచి గట్టి పోటీ లేకపోవడం కూడా కొరియన్ కనకరాజు కు కలిసొచ్చే అంశంగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తొలి వీకెండ్లో సినిమా మంచి ఆక్యుపెన్సీలను నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వరుణ్ తేజ్ కెరీర్లో ఇటీవల వచ్చిన వరుస పరాజయాల తర్వాత ఈ సినిమా విజయంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇప్పటికే ప్రమోషన్స్‌లో భాగంగా ప్రేక్షకులకు పూర్తి స్థాయి వినోదాన్ని అందించే చిత్రమిదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రీమియర్స్‌కు వచ్చిన పాజిటివ్ టాక్, బలమైన అడ్వాన్స్ బుకింగ్స్‌తో ‘కొరియన్ కనకరాజు’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్లు సాధిస్తుందనే ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ENE Repeat | ‘ఈఎన్ఈ రిపీట్’ అందరూ కలిసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది.. ట్రైలర్ లాంచ్‌లో తరుణ్ భాస్కర్!
Pocket Rockets | నిహారిక కొణిదెల ‘పాకెట్ రాకెట్స్’ టీజర్ విడుదల.. డిసెంబర్ 11న థియేటర్లలో సందడి!
Air Pollution | నగరాల్లో తీవ్రమవుతున్న వాయు కాలుష్యం.. జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న నిపుణులు..
ఎంజీయూ హాస్టల్స్ డైరెక్టర్‌గా డా.జి లక్ష్మీప్రభ నియామకం
‘గొర్రెల కాపరులకు పింఛన్లు ఇవ్వాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

