OTT Movies | సినీ ప్రేక్షకులకు ఈ వారం ఓటీటీ వేదికలు భారీ వినోదాన్ని అందించేందుకు సిద్ధమయ్యాయి. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, ఇంగ్లీష్, కొరియన్ భాషలకు చెందిన పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఒకేసారి స్ట్రీమింగ్కు వచ్చాయి. ముఖ్యంగా బాక్సాఫీస్ హిట్ చిత్రాలతో పాటు యాక్షన్, క్రైమ్, వార్ డ్రామా, ఫ్యామిలీ ఎంటర్టైనర్లతో మొత్తం 17 సినిమాలు, సిరీస్‌లు ప్రేక్షకులను అలరించనున్నాయి. అందులో టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన అఖిల్ అక్కినేని నటించిన ‘లెనిన్’ ఓటీటీ ఎంట్రీ ఇవ్వడం విశేషం. అలాగే విజయ్ ఆంటోని నటించిన ‘వంద దేవుళ్లు’, యాక్షన్ సిరీస్ ‘ఆపరేషన్ సఫేద్ సాగర్’, క్రైమ్ థ్రిల్లర్ ‘వదంది సీజన్ 2’ కూడా ఈ వారమే స్ట్రీమింగ్ ప్రారంభించాయి.
జీ5లో విడుదలైన చిత్రాలు
లెనిన్ (తెలుగు) – అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ డ్రామా. థియేటర్లలో ఘన విజయం సాధించిన ఈ చిత్రం ఇప్పుడు జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది.
వంద దేవుళ్లు – విజయ్ ఆంటోని నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్. తెలుగు, తమిళంతో పాటు ఇతర భాషల్లో కూడా అందుబాటులో ఉంది.
తుంబడ్ చీ మంజులా – మరాఠీ చిత్రం.
సినిమాలు:
హృదయం మురళి (తెలుగు డబ్బింగ్)
మై వాపస్ ఆవుంగా (హిందీ)
ది లాస్ట్ హౌస్ (ఇంగ్లీష్)
లవ్ హార్డ్స్ (హాలీవుడ్)
బిగ్ చికెన్: ఏ ఫాస్ట్ ఫుడ్ కాన్స్పరసీ (డాక్యుమెంటరీ)
ది రిబ్బన్ హీరో
వెబ్ సిరీస్‌లు:
ఆపరేషన్ సఫేద్ సాగర్ (తెలుగు సహా పలు భాషల్లో)
రికీ గెర్వైస్: ఆలే క్యాట్
అవర్ స్టిక్కీ లవ్ (కొరియన్)
డెత్ ఇంక్ – సీజన్ 4
అమెజాన్ ప్రైమ్ వీడియోలో
ఓ సుకుమారి (తెలుగు)
వదంది – సీజన్ 2 (తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం)
జియో హాట్‌స్టార్
ది సూపర్ మారియో గెలాక్సీ (ఇంగ్లీష్)
సన్ నెక్స్ట్
సత్యతిల్ సంబవిచతు (మలయాళం)
మనోరమ మ్యాక్స్
పొంగళ (మలయాళం)
ఈ వారంలో ఎక్కువ ఆసక్తి రేకెత్తిస్తున్న విడుదలల్లో ‘లెనిన్’, ‘వదంది సీజన్ 2’, ‘ఆపరేషన్ సఫేద్ సాగర్’, ‘వంద దేవుళ్లు’ ప్రధానంగా నిలిచాయి. యాక్షన్, థ్రిల్లర్, ఫ్యామిలీ డ్రామా, క్రైమ్, కామెడీ వంటి విభిన్న జానర్లలో వచ్చిన ఈ కంటెంట్‌తో అన్ని వర్గాల ప్రేక్షకులకు మంచి వినోదం లభించనుంది. థియేటర్లలో మిస్ అయిన సినిమాలను ఇంట్లోనే ఆస్వాదించాలనుకునే వారికి ఈ వారం ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు మంచి ఎంపికగా మారనున్నాయి.