పల్లె రోడ్డు పరేషాన్ ప్రయాణమంటే.. ప్రమాదమే
గ్రామీణ ప్రాంతాల్లోని రహదారులు రెండేండ్లుగా అభివృద్ధికి నోచుకోకపోవడంతో అధ్వానంగా మారాయి. పంచాయతీరాజ్‌శాఖ ప్రతిష్ఠాత్మకంగా తొలిసారి హైబ్రిడ్ యాన్యుటీ మోడల్(హ్యామ్) రోడ్లు నిర్మిస్తామని గొప్పలు చెప్పినా ఆర్థిక అడ్డంకులతో పనులు పట్టాలెక్కడం లేదు.
- 6,294 కోట్ల భారీ ప్రాజెక్టుకు ఆర్థిక అడ్డంకులు
- సంక్రాంతికైనా ‘హ్యామ్’ రోడ్లు మొదలయ్యేనా?
- నిధుల్లేక పంచాయతీరాజ్ శాఖలో సాగని పనులు
- కాంట్రాక్టర్లకు రుణాలందక మొదలు కాని వైనం
- ప్రభుత్వ వాటా నిధులకూ హడోపైనే ఆశలు
గ్రామీణ ప్రాంతాల్లోని రహదారులు రెండేండ్లుగా అభివృద్ధికి నోచుకోకపోవడంతో అధ్వానంగా మారాయి. పంచాయతీరాజ్‌శాఖ ప్రతిష్ఠాత్మకంగా తొలిసారి హైబ్రిడ్ యాన్యుటీ మోడల్(హ్యామ్) రోడ్లు నిర్మిస్తామని గొప్పలు చెప్పినా ఆర్థిక అడ్డంకులతో పనులు పట్టాలెక్కడం లేదు. దీంతో దసరా, దీపావళి అంటూ ప్రభుత్వం వాయిదా వేస్తుండటంతో గుంతల రోడ్లపై ప్రయాణిస్తున్న ప్రజలకు ఉపశమనం కలుగుతుందా అని అనేది అనుమానంగా ఉన్నది.
వేల కిలోమీటర్ల రహదారుల నిర్మాణానికి టెండర్లు పిలిచి, ప్యాకేజీలు ఖరారు చేసినా పనులు ప్రారంభం కాకపోవడం ప్రభుత్వ పనితీరుపై ప్రశ్నలు రేకెత్తిస్తున్నది. కాంట్రాక్టర్లు బ్యాంకుల నుంచి రుణాలు తెచ్చుకోలేకపోతుండగా, ప్రభుత్వ వాటా నిధుల సమీకరణ కూడా ఇంకా కొలికి రాలేదు. హడో నుంచి రుణాల కోసం ప్రయత్నాలు, వడ్డీ రేట్లపై చర్చలతో వ్యవహారం సాగుతున్నది. ఈ పరిస్థితుల్లో సంక్రాంతి నాటికి పనులు ప్రారంభమవుతాయని అధికారులు చెప్తున్నా మరోసారి వాయిదా పడదనే నమ్మకం లేకుండా పోయింది.
హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రవ్యాప్తంగా 7,449.50 కిలోమీటర్ల మేర పంచాయతీరాజ్ రహదారులను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 2,162 రోడ్డు పనులను 17 ప్యాకేజీలుగా విభజించింది. మొత్తం రూ.6,294.81 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు పిలిచించి. తొలుత కాంట్రాక్టర్ల నుంచి ఆశించిన స్పందన రాలేదు. చిన్నచిన్న రోడ్డు మార్గాలు, రాష్ట్రవ్యాప్తంగా చెల్లాచెదురుగా ఉన్న పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ఆసక్తి చూపలేదు. దీంతో టెండర్ల ప్రక్రియ కూడా నెమ్మదించింది.
ఎట్టకేలకు ఇతర రాష్ర్టాల కాంట్రాక్టర్లు, ఏజెన్సీలు దక్కించుకున్నా పనులు మాత్రం ప్రారంభం కాలేదు. హ్యామ్ విధానంలో పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు తమ వాటా కింద భారీ మొత్తాన్ని సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ప్రాజెక్టు వ్యయంలో 60శాతం భరించాలి. మిగతా 40శాతం ప్రభుత్వ వాటాగా ఉంటుంది. కాంట్రాక్టర్లు తమ వాటా నిధుల కోసం బ్యాంకులను ఆశ్రయిస్తున్నారు. రుణాలు మంజూరైతేనే పనులు ప్రారంభించే పరిస్థితి నెలకొన్నది. ప్రస్తుతం పనుల ప్రదేశాల్లో ఏర్పాట్లు చేసుకుంటూ, బ్యాంకుల నుంచి రుణాలు పొందేందుకు ప్రయత్నిస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు. అంటే టెండర్లు పూర్తయినా, కాంట్రాక్టులు ఖరారైనా.. డబ్బులు చేతికి వచ్చేదాకా పనులు ప్రారంభం కాని పరిస్థితి నెలకొన్నది.
తేలని వడ్డీ రేట్ల వ్యవహారం
కాంట్రాక్టర్ల పరిస్థితి ఇలా ఉంటే ప్రభుత్వ వాటా నిధుల సమీకరణ కూడా సమస్యగా మారింది. హ్యామ్ ఒప్పందం ప్రకారం ప్రభుత్వం ప్రాజెక్టు వ్యయంలో 40శాతం భరించాలి. కాంట్రాక్టర్లు పెట్టే మిగిలిన 60శాతాన్ని ప్రభుత్వం నిర్వహణ నిబంధనల కింద 15 ఏండ్ల్లపాటు ప్రతి ఆరు నెలలకూ ఒకసారి వాయిదాల రూపంలో చెల్లించాలి. ఈ చెల్లింపులకు అవసరమైన నిధుల కోసం పంచాయతీరాజ్ శాఖతోపాటు రోడ్లు, భవనాల శాఖ రహదారి పనులకు కూడా హడో నుంచి రుణాలు పొందాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. ఆర్‌అండ్‌బీకి చెందిన సుమారు రూ.9వేల కోట్ల హ్యామ్ పనుల రుణాలు కూడా ఇందులో భాగంగా ఉన్నాయి. హడో నుంచి రుణాలు పొందేందుకు ప్రభుత్వం చర్చలు జరుపుతున్నా వడ్డీ రేట్ల అంశం ఇంకా తేలలేదు. రుణాలపై ఎంత వడ్డీ చెల్లించాలన్న దానిపై చర్చలు కొనసాగుతున్నాయి. వడ్డీ రేట్లు ఖరారైతేనే రుణాల ప్రక్రియ ముందుకు వెళ్లే అవకాశం ఉన్నది. అటు కాంట్రాక్టర్లకూ బ్యాంకు రుణాలు, ఇటు ప్రభుత్వానికీ హడో నిధులు.. ఈ రెండు అంశాలూ కొలికి వస్తేనే పనులకు మార్గం సుగమమవుతుంది.
సంక్రాంతి గడువుపైనా అనుమానాలే
కాంట్రాక్టర్లకు రుణాలు మంజూరైన తర్వాత అప్పాయింటెడ్ డే ఒప్పందాలు చేసుకుంటామని అధికారులు చెప్తున్నారు. ఆ రోజు నుంచి 18 నెలల్లో పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. రాబోయే రెండు నెలల్లో రుణాలు మంజూరయ్యే అవకాశం ఉన్నదని, అనంతరం సంక్రాంతి నాటికి పనులు ప్రారంభిస్తామని ఓ ఉన్నతాధికారి వెల్లడించినట్టు సమాచారం. అయితే రుణాల మంజూరుపై స్పష్టత లేకుండానే పనుల ప్రారంభానికి గడువు ప్రకటించడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఆర్థికపరమైన చికులు తొలగకపోతే ఈ గడువు కూడా మించిపోయేలా కనిపిస్తున్నది. రోడ్ల కోసం ప్రభుత్వం రూ.వేల కోట్ల ప్రాజెక్టును ప్రకటించినా, ప్రజలకు మాత్రం ఇప్పటికీ గుంతల రోడ్లే దికవుతున్నాయి. విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు, రోగులు నిత్యం ఇబ్బందులు ఎదురొంటున్నారు. అత్యవసర వైద్య సేవలకు వెళ్లాల్సిన సందర్భాల్లో అధ్వాన రహదారులు మరింత సమస్యగా మారుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నిధుల సమీకరణ, వడ్డీ రేట్లు, బ్యాంకు రుణాల పేరుతో పనులను వాయిదా వేస్తూ పోవడం గ్రామీణ ప్రజలకు తీవ్ర నిరాశ కలిగిస్తున్నది.

సంగారెడ్డి నియోజకవర్గంలోని సదాశివపేట మండలం ఆత్మకూరు-సింగర్ రోడ్డు పూర్తిగా ధ్వంసం అయింది. రూ.ఐదు కోట్లతో ఆరోగ్యశాఖ మంత్రి దామోద రాజనర్సింహ శంకుస్థాపన చేసి నెలలు గడుస్తున్నా.. ఇంకా పనులు ప్రారంభం కాలేదు. దీంతో గతుకుల రోడ్డుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

కరీంనగర్ మానకొండూర్ మండలకేంద్రం శివారులో గుంతలు తేలిన రోడ్డు

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో నేషనల్ హైవే నుంచి గాజులపేట గ్రామానికి వచ్చే ప్రధాన రహదారి అడుగడుగునా ప్యాచులు తేలిన దృశ్యం

కరీంనగర్ జిల్లా మానకొండూరు టౌన్లో గుంతలు పడిన రోడ్డు
వికారాబాద్ మండలపరిధిలో అధ్వానంగా ఉన్న గోధుమగూడ – ద్యాచారం వెళ్లే రోడ్డు

కరీంనగర్ మానకొండూరు నియోజకవర్గంలోని అన్నారం గ్రామంలో రోడ్డు గుంతలు పడి కంకర తేలి దుమ్మూధూళి లేవడంతో ఇబ్బందులు పడుతున్న వాహనదారులు

బురద, గుంతలమయంగా మారి బీటీకి నోచుకోని సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలంలోని బొల్లంపల్లి రోడ్డు

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో పూర్తిగా ధ్వంసమైన లక్ష్మీపూర్ గ్రామం నుంచి భీమిని మండల కేంద్రానికి వచ్చే రోడ్డు

మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి నియోజకవర్గం భీమిని మండలంలో వడాల-చిన్నగుడిపేట గ్రామాల మధ్య ఉన్న నాలుగు కిలోమీటర్ల రోడ్డు కంకర తేలి గుంతలమయంగా మారింది. నిత్యం భీమిని మండలకేంద్రానికి రాకపోకలు సాగించే ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్నరు

కంకర తేలిన సూర్యాపేట జిల్లా తిరుమలగిరి-తాటిపాముల బీటీ రోడ్డు

గుంతలు తేలిన రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి నుంచి మోమినిపేట్ వెళ్లే దారి

కరీంనగర్ మానకొండూరు శివారులో కల్వర్టు వద్ద గుంతలు పడిన రోడ్డు

కంకరతేలి గుంతలుగా మారిన సిద్దిపేట నుంచి చిన్న గుండవెల్లికి వెళ్లే దారి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

