భారత్‌కు అసలు టెస్ట్
టీ20, వన్డే సిరీస్ విజయాల ఉత్సాహంతో ఉన్న టీమిండియాకు న్యూజిలాండ్ గడ్డపై అసలైన సవాల్ ఎదురుకానుంది. ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ రేసులో నిలవాలంటే కీలకమైన రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా గురువారం మొదలయ్యే తొలి టెస్ట్ లో ఆతిథ్య కివీస్‌తో తలపడనుంది.
- నేటి నుంచి న్యూజిలాండ్‌తో తొలి టెస్టు మ్యాచ్
- డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో కీలకంగా సిరీస్ ఫలితం
- తెల్లవారుజామున 3.30 నుంచి సోనీ స్పోర్ట్స్ లో లైవ్
వెల్లింగ్టన్: టీ20, వన్డే సిరీస్ విజయాల ఉత్సాహంతో ఉన్న టీమిండియాకు న్యూజిలాండ్ గడ్డపై అసలైన సవాల్ ఎదురుకానుంది. ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ రేసులో నిలవాలంటే కీలకమైన రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా గురువారం మొదలయ్యే తొలి టెస్ట్ లో ఆతిథ్య కివీస్‌తో తలపడనుంది. భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3.30 గంటలకే ఈ పోరు షురూ అవనుంది. డబ్ల్యూటీసీ పట్టికలో కివీస్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా, నాలుగో స్థానంలో ఉన్న భారత్ ఫైనల్ చేరాలంటే మిగిలిన 7 మ్యాచ్‌ల్లో కనీసం 6 గెలవాల్సిన పరిస్థితి నెలకొంది.
ఇక, టెస్ట్ క్రికెట్లో భారత్‌కు న్యూజిలాండ్ ఎప్పుడూ కొరకరాని కొయ్యగానే ఉంది. విరాట్ కోహ్లీ సారథ్యంలో ప్రపంచమంతా జయకేతనం ఎగురవేసినా కివీస్ గడ్డపై మాత్రం గెలవలేకపోయింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో స్వదేశంలోనూ 0-3తో వైట్‌వాష్‌కు గురైంది. చివరిసారిగా 2009లో ధోనీ నాయకత్వంలో హామిల్టన్‌లో భారత్ టెస్ట్ మ్యాచ్, సిరీస్ గెలిచింది. గత 50 ఏండ్లలో న్యూజిలాండ్‌లో మన జట్టు గెలిచిన ఏకైక టెస్ట్ అదే కావడం గమనార్హం. ఇప్పుడు శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని యువ జట్టు ఆ 17 ఏండ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించాలని పట్టుదలతో ఉంది.
నలుగురు పేసర్ల వ్యూహంతో
భారత స్పెషలిస్ట్ బ్యాటర్లయిన యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, దేవ్‌దత్ పడిక్కల్, శుభ్‌మన్ గిల్, ధ్రువ్ జురెల్‌కు న్యూజిలాండ్‌లో ఇదే తొలి టెస్ట్ కావడం గమనార్హం. రిషబ్ పంత్ ఒక్కడే గతంలో ఇక్కడ రెండు టెస్టులు ఆడాడు. న్యూజిలాండ్-ఏ జట్టుతో టెస్టు సిరీస్‌లో రెండు శతకాలతో మెరిసిన జైస్వాల్, సీనియర్ బ్యాటర్ రాహుల్ జట్టుకు శుభారంభం అందివ్వాల్సి ఉంది. ఇక, ఈ ఏడాది ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 62.43 సగటుతో 1,436 పరుగులు సాధించి అద్భుత ఫామ్‌లో ఉన్న పడిక్కల్ పై జట్టు భారీ అంచనాలు పెట్టుకుంది.
బ్యాటర్ గా ఇంగ్లండ్ గడ్డపై పరుగుల మోత మోగించిన కెప్టెన్ గిల్ కివీస్ గడ్డపైనా అదే జోరు కొనసాగిస్తే జట్టుకు తిరుగుండదు. బేసిన్ రిజర్వ్ పిచ్‌పై దట్టమైన పచ్చికఉంది. తొలి రెండు రోజులు పేసర్లకు స్వర్గధామంగా ఉండే ఈ పిచ్, తర్వాత బ్యాటింగ్‌కు అనుకూలంగా మారనుంది. ఈ నేపథ్యంలో నలుగురు పేసర్లతో బరిలోకి దిగుతామని గిల్ ఇప్పటికే సంకేతాలిచ్చాడు. ఈ టూర్ లో వైట్ బాల్ ఫార్మాట్‌కు దూరంగా ఉండి తగినంత విశ్రాంతి తీసుకున్న పేస్ లీడర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ దళాన్ని నడిపించనున్నాడు. మిగిలిన మూడు స్థానాల కోసం హైదరాబాదీ సిరాజ్, ప్రసిద్ధ్, ఆకాశ్ దీప్, అన్షుల్ కాంబోజ్, బ్రార్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. బ్యాటింగ్ లోతు కోసం 8వ స్థానంలో నితీశ్ రెడ్డిని ఆడిస్తారా లేక బ్యాటింగ్ చేయగల పేసర్లను ఎంచుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది.
జోష్‌లో కివీస్
భారత్ చేతిలో టీ20, వన్డే సిరీస్ కోల్పోయినప్పటికీ టెస్టుల్లో సొంతగడ్డపై న్యూజిలాండ్ చాలా బలంగా ఉంది. ఇంగ్లండ్ గడ్డపై ఇటీవలే 2-1తో టెస్ట్ సిరీస్ గెలిచి బజ్‌బాల్ శకానికి ముగింపు పలికిన ఆ జట్టు రెట్టించిన ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. 6 అడుగుల 8 అంగుళాల కైల్ జేమీసన్, 6 అడుగుల 5 అంగుళాల జాకబ్ డఫీ, నాలుగో వన్డేల్లో ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసి భయపెట్టిన మాథ్యూ హెన్రీ పేస్ భారత బ్యాటర్ల సవాల్ విసరనున్నారు.
ఇక,. గాయపడిన మిచెల్ శాంట్నర్ స్థానాన్ని గ్లెన్ ఫిలిప్స్ భర్తీ చేయనున్నాడు. వన్డేల్లో విల్ యంగ్ తిరిగి ఫామ్‌లోకి రావడం, గాయం నుంచి రచిన్ రవీంద్ర పునరాగమనం ఆతిథ్య జట్టకు శుభసూచకం. కెప్టెన్ టామ్ లాథమ్ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్నప్పటికీ డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ రూపంలో నాణ్యమైన ఆల్‌రౌండర్లతో కివీస్ సమతూకంలో ఉంది.
- పేసర్ బుమ్రా మరో 3 వికెట్లు తీస్తే జవగల్ శ్రీనాథ్ (236)ను దాటి భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన పదో బౌలర్‌గా నిలుస్తాడు.
తుది జట్లు (అంచనా)
భారత్: జైస్వాల్, రాహుల్, పడిక్కల్, గిల్ (కెప్టెన్), పంత్ (కీపర్), జురెల్, జడేజా, ఆకాశ్ దీప్ / అన్షుల్/నితీశ్ రెడ్డి , బుమ్రా, సిరాజ్, ప్రసిద్ధ్ / బ్రార్.
న్యూజిలాండ్: లాథమ్ (కెప్టెన్), కాన్వే, నికోల్స్, రచిన్, డారిల్ మిచెల్, బ్లండెల్ (కీపర్), గ్లెన్ ఫిలిప్స్, నేథన్ స్మిత్, జేమీసన్, హెన్రీ, డఫీ/టిక్నర్.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

