శభాష్.. చంద్రకాంత్.. వైకల్యాన్ని అధిగమించి పారిశ్రామికవేత్తగా ఎదిగిన దివ్యాంగుడు
నాడు బీఆర్ఎస్ సర్కార్ సహకారంతో 90 శాతం వైకల్యాన్ని అధిగమించి పారిశ్రామిక వేత్తగా ఎదిగిన దివ్యాంగ పారిశ్రామికవేత్త చంద్రకాంత్ సాగర్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందించారు. చంద్రకాంత్ ప్రస్థానానికి అడుగడుగునా అండగా నిలిచిన కేటీఆర్..
- అభినందించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
- తెలంగాణ భవన్లో స్వయంకృషి లోగో ఆవిష్కరణ
హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ) : నాడు బీఆర్ఎస్ సర్కార్ సహకారంతో 90 శాతం వైకల్యాన్ని అధిగమించి పారిశ్రామిక వేత్తగా ఎదిగిన దివ్యాంగ పారిశ్రామికవేత్త చంద్రకాంత్ సాగర్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందించారు. చంద్రకాంత్ ప్రస్థానానికి అడుగడుగునా అండగా నిలిచిన కేటీఆర్.. నేడు మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు. బుధవారం తెలంగాణ భవన్లో ప్రణవ్ ఎంటర్ప్రైజెస్ అధినేత చంద్రకాంత్సాగర్ కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. వైకల్యం ఉన్నప్పటికీ స్వయంకృషి, పట్టుదలతో ఎదిగి, తన పరిశ్రమ ద్వారా పలువురు దివ్యాంగులకు ఉపాధి కల్పిస్తున్న చంద్రకాంత్‌ను శభాష్ అంటూ కేటీఆర్ మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయనతో ఆత్మీయంగా మాట్లాడుతూ కలిసి భోజనం చేశారు. ఆయన స్థాపించిన స్వయంకృషి ఫౌండేషన్ లోగోను ఆవిషరించారు. దివ్యాంగుల సాధికారత, ఆత్మగౌరవంతో కూడిన జీవనం, స్వావలంబన కోసం స్వయంకృషి ఫౌండేషన్ తలపెట్టే కార్యక్రమాలు విజయవంతం కావాలని కేటీఆర్ ఆకాంక్షించారు.
కేటీఆర్ కొండంత అండగా నిలిచారు : చంద్రకాంత్సాగర్
బీఆర్ఎస్ హయాంలో కేటీఆర్ అందించిన సహకారం, ప్రోత్సాహం తన పారిశ్రామిక ప్రస్థానంలో ఎంతో కీలకమని చంద్రకాంత్సాగర్ తెలిపారు. యాదాద్రి జిల్లా చౌట్‌ప్పల్ మండలం దండు మల్కాపూర్‌లోని టెక్స్టైల్ పార్క్‌లో ప్రణవ్ ఎంటర్ప్రైజెస్ పేరిట ఓ యూనిట్‌ను స్థాపించానని చెప్పారు. తన యూనిట్‌కు కేటీఆర్ స్థలం కేటాయించడమే గాక ‘ఐలా’ పర్మిషన్ కోసం చేసిన మేలును ఎన్నటికీ మరచిపోనంటూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తాను స్థాపించిన స్వయంకృషి ఫౌండేషన్ ద్వారా దివ్యాంగులకు ఉపాధి అవకాశాలు కల్పించడం, వారిని స్వావలంబన దిశగా ప్రోత్సహించడం లక్ష్యంగా పనిచేస్తానని చంద్రకాంత్ వివరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

