ధోకాలో కాంగ్రెస్ను మించినోళ్లు లేరు!
బాగుందబ్బా..ఎలాగైతేనేం. చేయాల్సింది చేసేసినం. అనుకున్నది సాధించినం. లేకపోతే మాతో పెట్టుకుంటరా. మమ్ముల లెక్కజెయ్యరా? కండ్లకు కనిపిస్తున్నది కదా? కలలో కూడా మేం జేసినపనే యాదికొచ్చి ఉల్కిపడుతున్నరు గదా. అద్గది మేమంటే. ఉన్నకాడ ఉండనియ్యం.
బాగుందబ్బా..ఎలాగైతేనేం. చేయాల్సింది చేసేసినం. అనుకున్నది సాధించినం. లేకపోతే మాతో పెట్టుకుంటరా. మమ్ముల లెక్కజెయ్యరా? కండ్లకు కనిపిస్తున్నది కదా? కలలో కూడా మేం జేసినపనే యాదికొచ్చి ఉల్కిపడుతున్నరు గదా. అద్గది మేమంటే. ఉన్నకాడ ఉండనియ్యం.
ఊకున్నోళ్లనూ వదిలెయ్యం. చెప్పింది చెయ్యం. చేసేది చెప్పం. ఎవ్వలేమనుకున్నా చెయ్యాలనుకున్నది చేస్తం. ఎవ్వలూ కోలుకోకుండా దెబ్బతీస్తం. సర్వం నాశనం. సమస్తం దుర్భిక్షం మా సిద్ధాంతం. ప్రాజెక్టుల్లో నీళ్లుండనీ గాక..చెర్లన్నీ నిండుకోనీ గాక. నాశనం చేయడానికి ఏం ఉంటే ఏంది? పాత ముచ్చట్లను మాట్లాడుకునేలా చేయడానికి ఏమైనా చేస్తాం. లేకపోతే ఎట్లుండే తెలంగాణ, గిట్లెట్లయితది.
ఎట్లుండే పల్లె..మల్ల ఎట్లెట్ల ఎనుకటి లెక్క గాకపోతది. గా మధ్యల వచ్చినాయిన్నే మారుత్తాం. మంచిజేత్తం అని ఎగిరితే మేం వచ్చి దాని కథేందో జూడమనుకున్నరా? జనాలకు గప్పటి ఆంధ్రోళ్ల పాలనను గుర్తు జేయమనుకున్నరా? మార్చడానికి ఆయనెవ్వలు? మంచిజెయ్యడానికి గాయనకేం హక్కున్నది. మారనియ్యం, చెయ్యనియ్యం, జేసింది తుడిచేసుడే పని, చరిత్రను తెంపేసుడే కార్యం. ఎట్టకేలకు తెలంగాణ మళ్లీ పాత గుర్తులను వెతుక్కునే పనిలో పడింది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పుణ్యమాని పాలకుల గర్వపు పనుల ఫలమోగానీ కాలం మంట్లెగలిసింది. సరే ప్రకృతి ప్రకోపానికి మనిషేం జేస్తడులే అనుకోవచ్చుగానీ, వరాలిచ్చిన వేళ కూడా గలుమకు అడ్డం పంటా అంటే దాన్నెవరు మంచి అంటరు. పడ్డ ఆ నాలుగు చినుకులను కూడా ఒడిసిపట్టుకుని వాడుకునే సౌలతు ఉన్న ప్రాజెక్టులను పడావుపెట్టి కేసీఆర్ను సాధించడానికి జనాలను కరువు రాక్షసికి బలిచ్చే యజ్ఞం నిరాఘాటంగా సాగుతున్న తంతును ఏమనుకోవాలె. యావత్ రాష్ర్టానికి కరువు పూనిన శని ఎవరి చలువ? నిలువునా ఎండబెడుతున్న పుణ్యం ఎవరి తాలూకా?
అయిపాయె..యాళ్లకు అన్నీ ఇస్తే మమ్ముల యాది పెట్టుకుంటరా? అడుగకముందే తెచ్చిపెడ్తే మా ముఖాలు జూస్తరా? నిద్రల గూడా మమ్ముల్నే యాజ్జేసుకునేటట్టు..ఎప్పుడూ మ మ్ములనే జూసేటట్టు జేసుకున్నమా? లేదా? అదెట్లంటరా..అగో మరి పంటకు కావాల్సిన విత్తనాల నుంచి కొనే సౌలతు దాకా అన్నీ అడుక్కునేటట్టు జేసినమా? లేదా? ఇస్తనన్నవి ఇయ్యకుండా ఎప్పుడూ మా ముఖాలనే జూసేటట్టు జేసుకున్నమా లేదా?
నీళ్లు రాక పొలాలు ఎండుతుంటే ట్యాంకర్లు, ట్రాక్టర్లతో పోసుకొనుడు, పంటలకు కావాల్సిన ఎరువులు సాలినన్ని లేకుండా జేసుడు, వచ్చిన లోడు కోసం ఏగిలివారకముందే లైన్లల్ల నిలవడుడు, చెప్పులు పెట్టుడు, సుట్టబట్టలు పెట్టుడు, పండుగ లేదు, పబ్బం లేదు, ఆడోళ్లు ఇల్లూవాకిలి పిల్లాజెల్లను ఇడ్సిపెట్టి దుకాండ్ల ముందట పండుడు. పెండ్లాం మొగల్లు షిఫ్ట్ సిస్టమ్ లెక్క ఒగలు ఇంటికాడ, ఒగలు దుకాణాల కాడ ఉండేట్టు జేసినమా లేదా? గివన్నీ గాయన తోటి అయ్యేటిదేనా?
అన్నదాత ఏడపోతేంది, పొలాలు ఎండితే ఏంది, పోరగాండ్ల సదువులు ఆగమైతే మాకేంది? మా సూపంతా అయితే హస్తినకు, కాదంటే ఆటల నిర్వహణ, అదీ కాదంటే పెట్టుబడుల ముచ్చటజెప్పి వేరే దేశాలు పట్టుకు తిరుగడానికేగా? మేం జేసే ఏ పనైనా అడిగితే వాళ్ల సంగతే ఉంటది. జనాలు తిర్గబడ్తరని తెలిస్తే పక్కదారి పట్టిచ్చేదందుకు కొత్త ఉపాయాలు జేసుడే. మాకు తెల్సినట్టుగా పోయిన సర్కారోళ్లకు తెలుసనుకుంటాండ్రా ఏంది? అవును..మాకే తెలుసు..యే..ఇప్పుడు మీకు అనుభవంలకు వస్తే గూడా సోయత్తలేదా..ఓ దానికి ఓటి, ఓటి అడిగితే ఇంకోటి ముందటేసుకుని గప్పటి సర్కార్తోనే ఇప్పుడు చిక్కులని చెప్పుకొంటా పూట గడుపుతున్న ముచ్చట్లు సూత్తాంటే గూడా మీకు బుద్ధత్తలేదంటే మిమ్ముల ఏమనాలే. ఇంకా అమాయకంగా జూస్తే మిమ్ముల ఎవడు బాగుజెయ్యాలే. కాదా మరి..నాట్లేసినం..నీళ్ల్లియ్యండి అంటే ప్రాజెక్టులు కూలుతానయ్..అస్సలే కుదరదని చెప్తిమి. మంచిగనే ఉన్నయి గదా..ఉన్నకాడికి రిపేర్లు జేసి వాడుకోవచ్చని మీ నుంచి సలహాలొస్తే ఇంతపనికొస్తరా? అని ఉన్న నీళ్లన్నీ కిందికిడ్సి మనతోని ఎక్కడైతది, కూల్తే ఎవడు బాధ్యుడని తిక్క కుదిర్సినంక కూడా తెల్తలేదా? సరే సత్తా బతుకుతా..వానకాలం ఒడ్సింది. పండిన ఆ కొద్ది పంటనైనా కట్టం గాకుండా కొనండయ్యా..అంటే ఎక్కడికక్కడ కయ్యాలు పుట్టిచ్చి అగ్గువకో సగ్గువకో అమ్ముకున్నదే మంచిదిరా నాయనా..అని మీరే అనేటట్టు జేస్తున్నమా? లేదా?
పైసల్వేవని రైతుబంధు ఆగమాగం జేసినా సోయి వత్తలేదా. ఇంటి పెద్దాయన కరెంట్ బాయికాడికి పోయి దిక్కులేని సావు సత్తే ఐదు లచ్చల రూపాయిలిచ్చే గప్పటి సర్కార్ సాయాన్ని గూడా చేతికందకుంటా జేసినమా? లేదా? అన్నీ కాదు..ఇన్నాళ్లకు బాయిల పూడిక తీసే అపరయజ్ఞంలో మేం ఎంత పకడ్బందీ వ్యూహంతో సక్సెస్ అయినమో ఇప్పుడు ఊళ్లల్ల వ్యవసాయ బావుల కాడికి పోండ్రి కనిపిత్తది. కాలువలు పడావు పడె, బోళ్లు నోళ్లు తెర్సే, అప్పులు పుట్టే దిక్కు లేకపాయె, ఏదన్నా అమ్ముదామంటే హైడ్రా వైరస్ సోకే, అడ్తి దుకాండ్లల నమ్మే రోజులు పాయె, ఆడపిల్ల పెండ్లికి బంగారం షోకేసుల నుంచే సూడాల్సి రావట్టే. బియ్యం బ్లాక్ మార్కెట్కు తరలే. కొందామంటే ఇప్పటికే రూ.70, 80కి కిలాయే. కూరగాయలు కోనే భాగ్యమే లేకపాయె.
ఉల్లిగడ్డ కిలో వందకు చేరవట్టే. ఆఖరికి నీళ్లు తాగి పందామన్నా నల్లాలల్ల కూడా బొట్టు వచ్చే దిక్కు దూరమవ్వవట్టే. మరి గివ్వన్నీ గా కేసీఆర్ సారుంటే జేసేటోడా? గిసొంటి అనుభవాలను కలిగించేటోడా? గా గొప్పతనం మాదే. గీ విషయంల మమ్ముల గొట్టేటోడే లేడంతే.
అయినా..ఆఖరుగా జెప్తున్నా..అయ్యేటివుంటే మాతోనే అని జెప్తం. మన్నుంచి గాకపోతే గప్పటోళ్ల తప్పులతో చెయ్యలేకపోతానం అని చేతులు దుల్పుకుంటం. మూడేండ్లల ముప్పుతిప్పులు పెట్టి ముప్పైవేల చెరువులు ఎండిపోయేటట్టు జేసినం. మీతో మూడుపూటల మట్టి బుక్కిస్తున్నం. మల్లో మూడు తరాలకు మా యాది మర్వకుండా జేసుకున్నం. ఇంట్లున్నోళ్లను బజార్న పడేసినం. పెండ్లం మొగళ్లను పైసల కోసం తన్నుకునేట్టు జేసినం. భూములపై ఆశలు లేకుండా జేసినం. పైస కోసం రక్తసంబంధాలు దూరం జేసినం. సాలా..ఇంకా జెప్పాల్నా.. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండ్రి. మా సిద్ధాంతాన్ని నమ్మి నట్టేట మునుగుండ్రి. గాయనెంత..గాయన బిషాదెంత? తొమ్మిదిన్నరేండ్ల గాయన ప్రయత్నాలను మూడేండ్లల పాతాళానికి తొక్కినంక గూడా మా గొప్పతనం మీకు తెల్వకపోతే మిమ్ముల్నెవ్వడూ మార్వలేడు. మీకెవ్వడూ సోయి తేలేడు.
రాజేంద్ర ప్రసాద్ చేలిక
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

