బాధితులు, నిందితులను ఒకేచోట ఉంచరాదు
మానవ అక్రమ రవాణా బాధితులకు పునరావాసం కల్పించే రక్షణ గృహాల్లో నిందితులు, వ్యభిచార గృహాల నిర్వాహకులను ఉంచరాదని హైకోర్టు స్పష్టంచేసింది. బాధితు లు, నిందితులను ఒకే చోట ఉంచడం వల్ల బా ధితుల భద్రతకు ముప్పు ఏర్పడటంతోపాటు పునరావాస ప్రక్రియకు విఘాతం కలుగుతుందని పేరొన్నది.
- మానవ అక్రమ రవాణాదారులు, వ్యభిచార నిర్వాహకులకుప్రత్యేక దిద్దుబాటు కేంద్రాలు ఏర్పాటు చేయాలి
- కేవలం ఎఫ్ఐఆర్ ఆధారంగా నిందితులుగా ముద్ర వేయొద్దు
- మెజిస్ట్రేట్లు యాంత్రికంగా ఉత్తర్వులు జారీచేయరాదు
- పలు మార్గదర్శకాలు జారీచేసిన హైకోర్టు
హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): మానవ అక్రమ రవాణా బాధితులకు పునరావాసం కల్పించే రక్షణ గృహాల్లో నిందితులు, వ్యభిచార గృహాల నిర్వాహకులను ఉంచరాదని హైకోర్టు స్పష్టంచేసింది. బాధితు లు, నిందితులను ఒకే చోట ఉంచడం వల్ల బా ధితుల భద్రతకు ముప్పు ఏర్పడటంతోపాటు పునరావాస ప్రక్రియకు విఘాతం కలుగుతుందని పేరొన్నది. బాధితుల కోసం ప్రత్యేక రక్ష ణ గృహాలు, అక్రమ రవాణాదారులు, వ్యభిచార నిర్వాహకుల కోసం ప్రత్యేక దిద్దుబాటు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేవలం ఎఫ్ఐఆర్ నమోదైనంత మాత్రాన ఓ వ్యక్తిని అక్రమ రవాణాదారుగా నిర్ధారించలేమని, గతంలో కేసు నమోదైన వ్యక్తి కూడా లైంగిక దోపిడీకి గురైన బాధితురాలై ఉండవచ్చని పేరొన్నది. ప్రతి ఒకరి పాత్రను సాక్ష్యాధారాల ఆధారంగా విడివిడిగా పరిశీలించాలని దర్యాప్తు అధికారులకు సూ చించింది. గతంలో కేసు నమోదైందనే కారణంతో బాధితురాలికి రక్షణ కల్పించేందుకు నిరాకరించరాదని స్పష్టంచేసింది.
మానవ అక్రమ రవాణా కేసుల్లో మెజిస్ట్రేట్లు యాంత్రికంగా ఉత్తర్వులు జారీచేయరాదని, కేసు పూ ర్వాపరాలు, వాస్తవాలను పరిశీలించి నిర్ణ యం తీసుకోవాలని ఆదేశించింది. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్లోని ఓ స్పా కేంద్రంపై పోలీసులు దాడిచేసి, తొమ్మిది మంది మహిళలను రక్షించారు. వారిని ‘ప్రజ్వల’ స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న రక్షణ గృహంలో ఉంచాలని మెజిస్ట్రేట్ ఆదేశించారు. కానీ, వారిలో ఓ మహిళపై గతంలో మానవ అక్రమ రవాణా కేసు నమోదైనందున ఆమెను రక్షణ గృహం లో చేర్చడంపై ‘ప్రజ్వల’ అభ్యంతరం వ్యక్తం చేసింది. బాధితులు, నిందితులను వేర్వేరుగా గుర్తించి తగిన చర్యలు తీసుకునేందుకు హైకోర్టు మార్గదర్శకాలు జారీచేసింది. డీజీపీతోపాటు మహిళా భద్రతా విభాగం, మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం ఫిబ్రవరి 25న రూపొందించిన ప్రామాణిక కార్యాచరణ విధానాన్ని (ఎస్వోపీ) అన్ని పోలీస్ స్టేషన్లకు పంపించి, అమలు చేయాలని ఆదేశించింది. పోలీసుల దాడులకు ముందే అనుమానిత వ్యభిచార గృహ నిర్వాహకులు, బాధితులను గుర్తించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని, గతంలో నమోదైన కేసుల వివరాల ను మేజిస్ట్రేట్ల దృష్టికి తీసుకురావాలని సూచించింది.
బాధితులకు వైద్య చికిత్స, కౌన్సెలింగ్ అందించడంతోపాటు ఎలక్ట్రానిక్ ఆధారాలు, ఇతర అన్ని సాక్ష్యాలను భద్రపరచాలని పేరొన్నది. బాధితుల వివరాలను గోప్యంగా ఉంచాలని, ప్రాథమిక గుర్తింపు కోసం వారిని నిందితులతో బలవంతంగా ముఖాముఖి నిలబెట్టరాదని, బాధితులకు అనుకూలమైన పద్ధతు ల్లో వాంగ్మూలాలు సేకరించాలని ఆదేశించిం ది. విచారణ నుంచి తప్పించుకునేందుకు నిందితులు బాధితుల ముసుగులో రక్షణ గృ హాల్లో చేరే ప్రయత్నాలు అడ్డుకోవాలని, బాధితులను నిందితులు బెదిరించకుండా, సాక్ష్యా ల్లో జోక్యం చేసుకోకుండా చూడాలని అధికారులకు స్పష్టంచేసింది.
బాల బాధితుల విషయంలో బాలల సంరక్షణ చట్టాల ప్రకారం చ ర్యలు తీసుకోవాలని పేరొన్నది. జిల్లా న్యాయ సేవాధికార సంస్థలు ప్రతి 3 నెలలకోసారి అవ గాహన కార్యక్రమాలు నిర్వహించాలని, పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో ప్రతి విద్యా సెమిస్టర్లో కనీసం ఒక కార్యక్రమం చేపట్టేలా విద్యాశాఖ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కలెక్టర్లు ప్రతి 6 నెలలకోసారి వివిధ శాఖలతో సమీక్షా సమావేశాలు నిర్వహించి, నివేదికలను హోంశాఖ ముఖ్య కార్యదర్శికి సమర్పించాలని స్పష్టం చేసింది. హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్ పీ శ్యామ్ కోశీ, జస్టిస్ నందికొండ నర్సింగరావు ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

