ఏపీ ప్రాజెక్టు పనులను అడ్డుకుంటం
నాగార్జునసాగర్ నుంచి తాగునీటి కోసమంటూ ఏపీ ప్రభుత్వం చేపట్టిన పనులను అడ్డుకొని తీరుతామని రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. ఇప్పటికే కేంద్రానికి, కేఆర్ఎంబీ (కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు)కి ఫిర్యాదులు చేశామని తెలిపారు.
- ఇప్పటికే కేంద్రం, కేఆర్ఎంబీకి ఫిర్యాదులు చేశాం
- సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
- కేటీఆర్ అల్టిమేటం నేపథ్యంలో హడావుడిగా ప్రెస్‌మీట్
హైదరాబాద్, నవంబరు18 (నమస్తే తెలంగాణ) : నాగార్జునసాగర్ నుంచి తాగునీటి కోసమంటూ ఏపీ ప్రభుత్వం చేపట్టిన పనులను అడ్డుకొని తీరుతామని రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. ఇప్పటికే కేంద్రానికి, కేఆర్ఎంబీ (కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు)కి ఫిర్యాదులు చేశామని తెలిపారు. ఏపీ ప్రభుత్వం జల్‌జీవన్ మిషన్ పేరిట నాగార్జునసాగర్ ప్రాజెక్టు డెడ్ స్టోరేజీ నుంచి సుమారు 7.8 టీఎంసీల జలాలను తాగునీటి కోసం వినియోగించుకొనేందుకు వాటర్‌గ్రిడ్ పథకాన్ని చేపట్టింది. ఏడాది కాలంగా పనులను నిర్వహిస్తున్నది. ఇటీవల అందుకు సంబంధించిన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఏపీ చేపట్టిన ప్రాజెక్టుతో తెలంగాణ ప్రయోజనాలకు తీరని విఘాతమని బీఆర్ఎస్ ఆందోళన వ్యక్తం చేసింది. తాజాగా పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా ప్రెస్‌మీట్ పెట్టి ప్రభుత్వానికి అల్టిమేటం జారీచేశారు.
తక్షణం స్పందించాలని, తెలంగాణ ప్రయోజనాలను కాపాడాలని, లేదంటే ప్రజాక్షేత్రంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. దీంతో సాగునీటిపారుదలశాఖ మంత్రి ఉన్నపళంగా స్పందించారు. కేటీఆర్ ప్రెస్‌మీట్ ముగిసిన గంటల వ్యవధిలోనే సచివాలయంలో స్వయంగా ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నాగార్జునసాగర్ జలాశయం నుంచి సుమారు 1.8 టీఎంసీల నీటిని తీసుకొనేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన తాగునీటి పథకంపై తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే తీవ్ర అభ్యంతరాలు తెలిపిందని వెల్లడించారు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు, కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తమ అభ్యంతరాలను పంపామని వివరించారు. తెలంగాణ నీటి హకులను ప్రభావితం చేసే ఏ పథకాన్నైనా వ్యతిరేకిస్తామని, రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సోనియాగాంధీ తీసుకున్న నిర్ణయాన్ని విస్మరించి కేటీఆర్ విమర్శలు చేయడం తగదని మండిపడ్డారు. సోనియాగాంధీ పుస్తకంలో తెలంగాణ ప్రస్తావన ఉందా, లేదా అన్నది అసలు విషయం కాదని, నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన నెహ్రూ కృషిని కేటీఆర్ తకువ చేసి మాట్లాడటం విడ్డూరమని అన్నారు. సాగునీటిరంగంలో రూ.1.83 లక్షల కోట్లు ఖర్చు చేశామని చెప్పుకుంటున్న బీఆర్ఎస్, ఆ వ్యయానికి తగిన ఫలితాలను రైతులకు అందించలేకపోయిందని ఆరోపించారు. గత ప్రభుత్వం సాగునీటి వ్యయంలో దాదాపు 75 శాతం గోదావరి బేసిన్‌కే కేటాయించి, కృష్ణా బేసిన్‌కు 25 శాతమే వెచ్చించారని, దానివల్ల మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల రైతులకు అన్యాయం జరిగిందని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో కృష్ణా జలాల వినియోగం పెరిగిందని అన్నారు. ప్రభుత్వంపై ఆరోపణలు మానుకోవాలని, తెలంగాణ నీటి ప్రయోజనాలను కాపాడి తీరుతామని స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

