కార్పెట్‌ను క్లీన్ చేయండిలా!
చాలామంది కంఫర్ట్ కోసం ఖరీదైన వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. ప్రతీ విషయంలో పర్ఫెక్ట్నెస్ ఉండేలా ముందునుంచే జాగ్రత్తలు తీసుకుంటుంటారు. అలాంటి వాటిలో కార్పెట్ వాడకం ఒకటి. చలికాలంలో ఇంట్లో కార్పెట్‌ని వాడటం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. ఈ సీజన్లో ఇంట్లోనూ చల్లని గాలులు మనల్ని ఉకిరిబికిరి చేస్తాయి. ఆ చలి నుంచి ఉపశమనం కలగాలంటే కార్పెట్ వాడాల్సిందే. దీనిని వాడటం వల్ల వేడి ఉత్పత్తి అయి శరీరానికి హాయినిస్తుంది.

అయితే, ఈ కార్పెట్‌ను సరిగ్గా మెంటెయిన్ చేయకపోతే.. కొన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇంట్లోనే వాయు కాలుష్యం పెరిగి అలర్జీ, ఆస్తమా వంటి సమస్యలు ఉన్నవారిలో మరింత అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ఆ తరహా సమస్యలు రాకుండా ఉండాలంటే.. కార్పెట్‌ను బాగా మెంటెయిన్ చేయాలి. సాధారణంగా బయటి నుంచి మన చెప్పులు, బూట్ల ద్వారానే దుమ్ము, ధూళి వస్తుంది. వాటిని లోపలి వరకూ రానివ్వకుండా బయటే వదలాలి. తలుపుల ముందు కచ్చితంగా డోర్ మ్యాట్స్ వేయాలి. ఇక పెంపుడు జంతువులు ఉంటే వాటి నుంచి వచ్చే వెంట్రుకలు, దుమ్ముని క్లీన్ చేయడానికి పెట్ హెయిర్ వ్యాక్యూమ్ బ్రష్‌లను వాడాలి. అయితే, దుమ్ము చేరకుండా కార్పెట్లని ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలి.
ఇందుకోసం హై ఎఫీషియెన్సీ పర్టిక్యులేట్ ఎయిర్ ఫిల్టర్ ఉన్న క్లీనర్స్ వాడితే.. కంటికి కనిపించని సూక్ష్మ ధూళికణాలు, అలర్జీ కారకాలు తొలగిపోతాయి. వారానికి రెండుమూడు సార్లు వాక్యూమ్ చేయాలి. అలానే ఏడాదికోసారైనా ప్రొఫెషనల్‌తో స్టీమ్ క్లీన్ చేయించడం మంచిది. దీనివల్ల బ్యాక్టీరియా, దుమ్ము వంటివి పూర్తిగా క్లీన్ అవుతాయి. కార్పెట్ క్లీనింగ్ అయ్యాక పూర్తిగా ఆరబెట్టాలి. ఏవైనా మరకలు పడితే వెంటనే వాటిని శుభ్రం చేయాలి. లేదంటే మరక మరింత లోపలికి వెళ్తుంది. దాన్ని తొలగించాలంటే.. బేకింగ్ సోడా, వైట్ వెనిగర్ వాడొచ్చు. కార్పెట్ క్లీన్‌గా ఉంటే.. మన ఆరోగ్యం కూడా బాగున్నట్టే!
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా