బూడిద లారీల్లో కలెక్టర్ దోపిడీ
రామగుండం ఎన్టీపీసీ ఉచితంగా ఇచ్చే బూడిదను తరలించే ఒక్కో లారీ నుంచి ఎలాంటి జీవో, సర్యులర్ లేకుండానే కలెక్టర్ రూ.500 చొప్పున అక్రమం గా వసూలు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారని బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ ఆరోపించా రు.
- సీబీఐ, ఈడీలకు ఫిర్యాదు చేస్తాం
- బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్
పెద్దపల్లి, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): రామగుండం ఎన్టీపీసీ ఉచితంగా ఇచ్చే బూడిదను తరలించే ఒక్కో లారీ నుంచి ఎలాంటి జీవో, సర్యులర్ లేకుండానే కలెక్టర్ రూ.500 చొప్పున అక్రమం గా వసూలు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారని బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ ఆరోపించా రు. బుధవారం ఆయన పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ కార్యాలయం తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. గత మూడేండ్లలో అధికారికంగానే 1.24 లక్ష ల ట్రిప్పుల ద్వారా రూ.6 కోట్ల వరకు వ సూలు చేశారని, దీనికి ఎలాంటి రసీదులు కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు.
ఎవరి ఆదేశాల మేరకు కలెక్టర్ ఈ డబ్బులు వ సూలు చేసి ఎవరి ఖజానాలోకి మళ్లించా రో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశా రు. ఇదే తరహాలో మట్టి తరలింపునకు క్యూబిక్ మీటర్‌కు రూ.40 నుంచి 50 మాత్రమే వసూలు చేయాల్సి ఉండగా, రూ.3,500 వసూలు చేస్తూ లారీ యజమానుల కడుపు కొడుతున్నారని మండిపడ్డారు. కలెక్టర్ వసూలు చేసిన రూ.6 కోట్లను తక్షణమే లారీ నంబర్ల ఆధారంగా ఆయా యజమానులకు తిరిగి చెల్లించాలని, లేదంటే డీపీటీవో, సీబీఐ, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, ఈడీలకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో శ్రీరామ లారీ యాష్ టిప్పర్ అసోసియేషన్ అధ్యక్షుడు పల్లె అశోక్, ముత్యం అనిల్‌గౌడ్, రాముగౌడ్ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

